బంతి ప‌డ‌కుండానే మ్యాచ్ ర‌ద్దు.. తొలి టీ20 వ‌ర్షార్ప‌ర‌ణం

India vs New Zealand First T20I abandoned due to rain.భార‌త్‌, న్యూజిలాండ్‌ జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గాల్సిన టీ20 మ్యాచ్ వ‌ర్షం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Nov 2022 2:31 PM IST
బంతి ప‌డ‌కుండానే మ్యాచ్ ర‌ద్దు.. తొలి టీ20 వ‌ర్షార్ప‌ర‌ణం

భార‌త్‌, న్యూజిలాండ్‌ జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గాల్సిన తొలి టీ20 మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ఒక్క బంతి కూడా ప‌డ‌కుండానే ర‌ద్దు అయ్యింది. భార‌త కాల‌మానం ప్ర‌కారం మ‌ధ్యాహ్నాం 12 గంట‌ల‌కు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే.. మ్యాచ్‌కు వేదికైనా వెల్లింగ్ట‌న్‌లో ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షం కురుస్తోంది. క‌నీసం ఐదు ఓవ‌ర్ల మ్యాచ్ అయినా జ‌రుగుతుందేమోన‌ని ఆశించిన అభిమానుల‌కు నిరాశే ఎదురైంది. ఎంత‌కీ వ‌ర్షం ఆగ‌క‌పోవ‌డంతో టాస్ వేయ‌కుండానే మ్యాచ్‌ను ర‌ద్దు చేస్తూ అంపైర్లు నిర్ణ‌యం తీసుకున్నారు. ఇరు జ‌ట్ల రెండో టీ20 మ్యాచ్ మౌంట్ మాంగ‌నుయ్ వేదిక‌గా ఆదివారం జ‌ర‌గ‌నుంది.

వర్షం కారణంగా భారత్, న్యూజిలాండ్ జట్ల ఆటగాళ్లు తమ త‌మ డ్రెస్సింగ్ రూమ్ లకే పరిమితం అయ్యారు. దీంతో స్టేడియం లోప‌ల ఇరు జ‌ట్లు పుట్‌వాలీ ఆడారు. ఇందుకు సంబంధించిన వీడియోను భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Next Story