రెండో వ‌న్డే వ‌ర్షార్ప‌ణం

India vs New Zealand 2nd ODI Match Abandoned Due To Rain.రెండో వ‌న్డేను వ‌రుణుడు అడ్డుకున్నాడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Nov 2022 1:33 PM IST
రెండో వ‌న్డే వ‌ర్షార్ప‌ణం

హామిల్ట‌న్ వేదిక‌గా న్యూజిలాండ్‌, భార‌త్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న రెండో వ‌న్డేను వ‌రుణుడు అడ్డుకున్నాడు. ప‌లుమార్లు మ్యాచ్‌కి అంత‌రాయం క‌లిగించాడు. భార‌త ఇన్నింగ్స్ 12.5 ఓవ‌ర్ల వ‌ద్ద భారీ వ‌ర్షం కురిసింది. దీంతో ఔట్ ఫీల్డ్ మొత్తం చిత్త‌డిగా మారింది. మ్యాచ్ నిర్వాహ‌ణ సాధ్యం కాద‌ని అంపైర్లు ఆట‌ను ర‌ద్దు చేశారు. ఆటను ర‌ద్దు చేసే స‌మ‌యానికి భార‌త్ 12.5ఓవ‌ర్ల‌లో 89/1తో నిలిచింది. శిఖ‌ర్ ధావ‌న్ 3 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట్ కాగా.. శుభ్‌మ‌న్‌గిల్‌(45 నాటౌట్‌), సూర్యకుమార్ యాద‌వ్‌(34 నాటౌట్‌) ఉన్నారు.

ఈ మ్యాచ్ ర‌ద్దు కావ‌డంతో మూడు వ‌న్డేల సిరీస్‌లో కివీస్ ప్ర‌స్తుతం 1-0 ఆధిక్యంలో కొన‌సాగుతోంది. ఆక్లాండ్ వేదిక‌గా జ‌రిగిన తొలి వ‌న్డేలో న్యూజిలాండ్ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇక బుధ‌వారం క్రైస్ట్‌చ‌ర్చ్ వేదిక‌గా జ‌రిగే ఆఖ‌రి వ‌న్డే కీల‌కంగా మారింది. ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిస్తే సిరీస్ ఆ జ‌ట్టు సొంతం కానుండ‌గా, భార‌త్ గెలిస్తే సిరీస్ స‌మం కానుంది.

Next Story