భార‌త్ -ఇంగ్లాండ్ సిరీస్ షెడ్యూల్ వ‌చ్చేసింది.. కొత్త స్టేడియంలో మ్యాచ్‌ల మోతే..

India vs England Series Schedule. క‌రోనా వైర‌స్ కార‌ణంగా భార‌త్‌లో జ‌ర‌గాల్సిన క్రికెట్ మ్యాచ్‌లు వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే.

By Medi Samrat  Published on  11 Dec 2020 7:34 AM GMT
భార‌త్ -ఇంగ్లాండ్ సిరీస్ షెడ్యూల్ వ‌చ్చేసింది.. కొత్త స్టేడియంలో మ్యాచ్‌ల మోతే..

క‌రోనా వైర‌స్ కార‌ణంగా భార‌త్‌లో జ‌ర‌గాల్సిన క్రికెట్ మ్యాచ్‌లు వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. ద‌క్షిణాఫ్రికాతో జ‌ర‌గాల్సిన వ‌న్డే సిరీస్ ర‌ద్దు కాగా.. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌)ను యూఏఈ వేదిక‌గా నిర్వ‌హించారు. ప్ర‌స్తుతం భార‌త్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం ప‌ట్టుతుండ‌డంతో.. మ‌న దేశంలో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వ‌హించేందుకు బీసీసీఐ( భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు) సిద్ద‌మైంది. వ‌చ్చే ఏడాది ఇంగ్లాండ్ జ‌ట్టు భార‌త్‌లో ప‌ర్య‌టించ‌నుంది. ఈ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి అధికారిక షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది బీసీసీఐ.

భారత్ - ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య నాలుగు టెస్టులు, 5 టీ20లు, 3వ‌న్డేలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ సిరీస్‌లో ఓ డే-నైట్ టెస్ట్ మ్యాచ్ కూడా జరుగుతుంది. క‌రోనా కార‌ణంగా మ్యాచ్‌ల‌ను మూడు వేదిక‌ల‌కే ప‌రిమితం చేశారు. భారత్- ఇంగ్లాండ్ దేశాల మధ్య డే - నైట్ టెస్ట్ మ్యాచ్ మొతేరాలోని కొత్త క్రికెట్ స్టేడియంలో జరుగుతుందని బీసీసీఐ సెక్రటరీ జైషా స్పష్టం చేశారు. అంతేకాదు టీట్వంటీ సిరీస్ మొత్తం కొత్తగా నిర్మించిన మొతేరా క్రికెట్ స్టేడియంలోనే జరుగుతుందని చెప్పారు. బీసీసీఐ కార్య‌ద‌ర్శి జై షా సొంత‌గ‌డ్డ కావ‌డంతో మొతెరాకు ఎక్కువ ప్రా‌ధాన్యం ద‌క్కిన‌ట్లుగా తెలుస్తోంది.

టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ..

తొలిటెస్టు : ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 9వరకు - చెన్నైలో

రెండో టెస్టు: ఫిబ్రవరి 13 నుంచి ఫిబ్రవరి 17వరకు- చెన్నైలో

మూడోటెస్టు: ఫిబ్రవరి 24 నుంచి ఫిబ్రవరి 28 వరకు - అహ్మదాబాదులో: (డే/నైట్)

నాల్గవ టెస్టు: 4 మార్చి నుంచి 8మార్చి వరకు - అహ్మదాబాదులో

టీ20 సిరీస్ షెడ్యూల్..

తొలి టీ20 : మార్చి 12 - అహ్మదాబాదు

రెండో టీ20: మార్చి 14 - అహ్మదాబాదు

మూడో టీ20 : మార్చి 16 - అహ్మదాబాదు

నాలుగో టీ20: మార్చి 18 - అహ్మదాబాదు

ఐదవ టీ20 : మార్చి 20 - అహ్మదాబాదు

వన్డే షెడ్యూల్:

తొలి వన్డే : మార్చి 23 - పూణే

రెండో వన్డే : మార్చి 26 - పూణే

మూడో వన్డే : మార్చి28 - పూణే


Next Story