భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో నాలుగో మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్ 307 పరుగుల వద్ద ముగిసింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జట్టు 145 పరుగులకే కుప్పకూలడంతో భారత్ ఎదుట 192 పరుగుల లక్ష్యం ఉంది. ఆ లక్ష్యాన్ని భారత్ 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో నాలుగో రోజునే మ్యాచ్ ముగిసింది.
నాలుగో టెస్టులో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 3-1తో తిరుగులేని ఆధిక్యం సాధించింది. భారత జట్టులో ధృవ్ జురెల్, శుభ్‌మన్ గిల్ ఆరో వికెట్‌కు అజేయంగా 72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జురెల్ 39 పరుగులతో, శుభ్‌మన్ 52 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా 55 పరుగులు చేశాడు.