ఇంగ్లండ్ చేతిలో 'రాంచీ' టెస్ట్ మ్యాచ్

టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య నాలుగో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. రాంచి వేదికగా శుక్రవారం మొదలైన

By Medi Samrat  Published on  24 Feb 2024 1:00 PM
ఇంగ్లండ్ చేతిలో రాంచీ టెస్ట్ మ్యాచ్

టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య నాలుగో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. రాంచి వేదికగా శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఈ క్రమంలో 302/7 ఓవర్‌ నైట్‌ స్కోరుతో శనివారం నాటి ఆట మొదలుపెట్టి 353 పరుగులకు ఆలౌట్‌ అయింది.తొలి ఇన్నింగ్స్ లో రూట్(121) సెంచరీ చేయడంతో ఇంగ్లాండ్ 353 పరుగుల భారీ స్కోర్ చేసింది. జడేజా నాలుగు, ఆకాష్ దీప్ మూడు వికెట్లు తీసుకున్నాడు. సిరాజ్ రెండు, అశ్విన్ ఒక వికెట్ తీసుకున్నాడు.

ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారతజట్టు రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి 73 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి కేవలం 219 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ అత్యధికంగా నాలుగు వికెట్లు తీశాడు. టామ్‌ హార్లే రెండు, జేమ్స్‌ ఆండర్సన్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు. ఇక భారత తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌(73) రాణించాడు. మిగతా వాళ్లలో శుబ్‌మన్‌ గిల్‌ 38 పరుగలతో ఫర్వాలేదనిపించాడు. ఆట ముగిసే సరికి ధ్రువ్‌ జురెల్‌ 30, కుల్దీప్‌ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ స్పిన్నర్ల ధాటికి భారత బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. ప్రస్తుతం భారత్ మరో 134 పరుగులు వెనకబడి ఉంది. చేతిలో మూడు వికెట్లు మాత్రమే ఉండడంతో ఇంగ్లాండ్ కు మంచి ఆధిక్యం ఖాయంగా కన్పిస్తుంది. జురేల్-కుల్దీప్ బ్యాటింగ్ తో ఎలాంటి మాయ చేస్తారో చూడాలి.

Next Story