ఆధిక్యం ఎవరిదో..? నేడే ఇంగ్లాండ్‌తో మూడో టీ20
India vs England 3rd T20I Match Preview.ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఓటమితో మొదలెట్టిన భారత్.. దెబ్బతిన్న పులిలా రెండో టీ20 మ్యాచ్‌లో ఘన విజయం సాధించి లెక్కసరి చేసింది.
By తోట వంశీ కుమార్ Published on 16 March 2021 5:45 AM GMTఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఓటమితో మొదలెట్టిన భారత్.. దెబ్బతిన్న పులిలా రెండో టీ20 మ్యాచ్‌లో ఘన విజయం సాధించి లెక్కసరి చేసింది. దూకుడైన బ్యాటింగ్‌తో మంగళవారం జరిగే మూడో టీ20లో విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యంలో నిలవాలని పట్టుదలగా ఉంది టీమ్ఇండియా. కెప్టెన్ కోహ్లీ ఫామ్‌లోకి రావడం, కుర్రాళ్లు దంచికొడుతుండడంతో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సిరీస్‌లోని మిగతా మ్యాచ్‌లకు అభిమానులను స్టేడియంలోకి అనుమతించడం లేదు. దీంతో ఖాళీ మైదానాల్లో మ్యాచ్‌లు ఆడనున్నారు.
రాహుల్ పై వేటు..
సిరీస్‌ను చేజిక్కించుకోవాలంటే నేడు జరిగే మ్యాచ్ ఇరు జట్లకు కీలకమే. దీంతో భారత్-ఇంగ్లాండ్‌లు మరోసారి హోరాహోరా పోరాడడం ఖాయం. తొలి మ్యాచ్‌లో విఫలం అయిన టీమ్ఇండియా రెండో మ్యాచ్‌లో అన్ని రంగాల్లో పుంజుకుని ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ ఏడాది చివర్లో టీ20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంతో జట్టు కూర్పుపై దృష్టిపెట్టిన టీమ్‌ఇండియా.. మూడో టీ20కి తుది జట్టు ఎంపికలో ఓ మార్పు జరిగే వీలుంది. తొలి రెండు టీ20లకు ఓపెనర్ రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చామని కోహ్లీ చెప్పిన నేపథ్యంలో మూడో మ్యాచ్‌లో అతడు ఖచ్చితంగా జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. రెండు మ్యాచ్‌ల్లో విఫలం అయిన రాహుల్(1,0) స్థానంలో రోహిత్ ఆడే అవకాశం ఉంది. తొలి మ్యాచ్‌లోనే అర్థశతకంతో సత్తాచాటిన ఇషాన్ కిషన్‌ను తప్పించకపోవచ్చు. ఇక అరగ్రేటం మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కనీసం నేటి మ్యాచ్‌లోనైనా క్రీజులోకి అడుగుపెట్టే ఛాన్స్ వస్తుందేమో చూడాలి. ఒకవేళ పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తే శార్దుల్ స్థానంలో అక్షర్ ను తీసుకోవచ్చు.
పుంజుకోవాలని..
తొలి మ్యాచ్‌లో నెగ్గి రెండో మ్యాచ్‌లో చతికిలపడింది ఇంగ్లాండ్. ఈ మ్యాచ్‌లో గెలిచి మళ్లీ విజయాల బాట పట్టాలని బావిస్తోంది. కెప్టెన్ మోర్గాన్‌తో పాటు రాయ్, బట్లర్, మలన్, బెయిర్ స్టో, స్టోక్స్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఆ జట్టు సొంతం. వీరిలో ఏ ఇద్దరు నిలిచినా టీమ్ఇండియా ముందు భారీ స్కోర్ తప్పదు. గాయంతో గత మ్యాచ్‌కు దూరమైన పేసర్ మార్క్‌వుడ్ తిరిగి జట్టులోకి వచ్చే వీలుంది. పిచ్ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండడంతో.. టామ్ కరన్ స్థానంలో మొయిన్ అలీని తీసుకోవచ్చు. టీ20ల్లో నెంబర్ వన్ ర్యాంక్‌లో కొనసాగుతున్న ఇంగ్లాండ్‌ను తక్కువగా అంచనా వేయడానికి వీలులేదు.