బంగ్లాదేశ్‌తో తొలిటెస్టుకు భారత జట్టులో బీసీసీఐ మార్పులు

India vs Bangladesh 1ST Test starts Wednesday in Dhaka. బంగ్లాదేశ్‌తో జరుగనున్న టెస్టు సిరీస్‌కు జట్టులో బీసీసీఐ పలు మార్పులు చేసింది.

By Medi Samrat  Published on  11 Dec 2022 3:45 PM GMT
బంగ్లాదేశ్‌తో తొలిటెస్టుకు భారత జట్టులో బీసీసీఐ మార్పులు
బంగ్లాదేశ్‌తో జరుగనున్న టెస్టు సిరీస్‌కు జట్టులో బీసీసీఐ పలు మార్పులు చేసింది. బంగ్లాతో జరిగిన రెండో వన్డేలో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడగా.. తొలి టెస్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. ఛెతేశ్వర్‌ పుజారా వైఎస్‌ కెప్టెన్‌గా నియామకమయ్యారు. అలాగే రోహిత్‌ స్థానంలో భారతజట్టు-ఏ కెప్టెన్‌ అభిమన్యు ఈశ్వర్‌ను జట్టులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈశ్వరన్‌ బంగ్లాదేశ్‌ పర్యటనలోనే ఉన్నాడు. బంగ్లాదేశ్-ఏతో జరిగిన నాలుగు రోజుల మ్యాచ్‌లో ఇండియా-ఏ జట్టు కెప్టెన్‌గా ఉండగా.. సిరీస్‌లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేశాడు. బంగ్లాదేశ్ 'ఏ' జట్టుతో జరిగిన తొలి టెస్టులో ఈశ్వరన్ 141 పరుగులు చేశాడు. రెండో టెస్టులో 157 పరుగులు రాణించాడు. ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా గాయం కారణంగా మొత్తం సిరీస్‌కు దూరమయ్యారు. భుజం గాయం నుంచి షమీ పూర్తిగా కోలుకోలేదని, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడని బీసీసీఐ తెలిపింది. షమీ, జడేజాల స్థానంలో లెఫ్టార్మ్ స్పిన్నర్ సౌరభ్ కుమార్‌ను జట్టులోకి తీసుకున్నారు. రెండో వన్డేలో రోహిత్ బొటన వేలికి గాయమైందన్న బీసీసీఐ.. ముంబయిలోని స్పెషలిస్ట్‌ను కలిస్తే విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలిపింది. అయితే, రోహిత్ స్థానంలో జట్టులోకి వచ్చినప్పటికీ ఈశ్వరన్‌ను తీసుకున్నా బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. తొలి టెస్టులో కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్‌ను ప్రారంభించే అవకాశాలున్నాయి.




Next Story