రెచ్చిపోయిన జ‌డేజా.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..

India vs Australia First T20 Update. ఆస్ట్రేలియాతో జ‌రిగిన తొలి టీ20లో మ్యాచ్‌లో భార‌త్ నిర్ణీత ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల

By Medi Samrat  Published on  4 Dec 2020 10:30 AM GMT
రెచ్చిపోయిన జ‌డేజా.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..

ఆస్ట్రేలియాతో జ‌రిగిన తొలి టీ20లో మ్యాచ్‌లో భార‌త్ నిర్ణీత ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 161 ర‌న్స్ చేసింది. కేఎల్ రాహుల్ హాఫ్ సెంచ‌రీతో రాణించ‌గా.. చివ‌ర్లో ర‌వీంద్ర జ‌డేజా శ‌ర‌వేగంగా 44 ర‌న్స్ చేశాడు. జ‌డేజా కేవ‌లం 23 బంతుల్లో అయిదు ఫోర్లు, ఒక సిక్స‌ర్‌తో 44 ర‌న్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే ఓపెన‌ర్ ధావ‌న్‌(1), కోహ్లీ(9)లు స్వ‌ల్ప స్కోర్ల‌కే నిష్క్ర‌మించారు.

మ‌రో ఓపెన‌ర్ కేఎల్ రాహుల్‌.. ధాటిగా బ్యాటింగ్ చేశాడు. రాహుల్ 41 బంతుల్లో ఒక సిక్స‌ర్‌, నాలుగు ఫోర్ల స‌హాయంతో 51 ర‌న్స్ చేసి ఔట‌య్యాడు. సాంస‌న్ 23, పాండ్యా 16 ర‌న్స్ చేశారు. ఆరంభం నుంచి ఆస్ట్రేలియా బౌల‌ర్లు ఇండియ‌న్ బ్యాట్స్‌మెన్‌ను క‌ట్ట‌డి చేశారు. ఓ ద‌శ‌లో ఇండియా 120 స్కోర్ కూడా దాటుతుందో లేదో తెలియ‌ని స్థితిలో.. జ‌డేజా స‌త్తా చాటాడు. ఇన్నింగ్స్ మ‌ధ్య‌లో జంపా, హెన్రిక్స్ బౌలింగ్‌ను ఎదుర్కోవ‌డంలో భార‌త బ్యాట్స్‌మెన్ త‌డ‌బ‌డ్డారు.


Next Story
Share it