గంభీర్ నిర్ణ‌యాలే ముంచుతున్నాయా.?

ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. దీని తర్వాత టీమ్ ఇండియా ఇక్కడి నుంచి మరింత ముందుకు వెళ్తుందని అనిపించింది.

By Kalasani Durgapraveen  Published on  4 Nov 2024 7:24 AM GMT
గంభీర్ నిర్ణ‌యాలే ముంచుతున్నాయా.?

ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. దీని తర్వాత టీమ్ ఇండియా ఇక్కడి నుంచి మరింత ముందుకు వెళ్తుందని అనిపించింది. టీ20 ప్రపంచకప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ ప్రధాన కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ ఎంట్రీ ఇచ్చాడు. టీమ్ ఇండియా కోచింగ్ స్టాఫ్‌లో మార్పు వచ్చింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌ను విజేతగా నిలిపిన తర్వాత గంభీర్.. టీమ్ ఇండియానునెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్తాడని భావించారు.. కానీ గంభీర్ వచ్చినప్పటి నుండి టీమ్ ఇండియా ప్ర‌ద‌ర్శ‌న ఆశాజ‌న‌కంగా లేదు. గంభీర్‌కు బీసీసీఐ నాలుగేళ్ల పాటు భారత జట్టు బాధ్యతలు అప్పగించింది. అంటే 2027లో జరిగే వన్డే ప్రపంచకప్ వరకూ అతను జట్టుతోనే ఉంటాడు. కానీ గంభీర్ నేతృత్వంలోని జట్టు చేసిన ప్రదర్శన అంచనాలను తారుమారు చేసింది.

శ్రీలంక టూర్‌తో టీమిండియా కోచ్‌గా గంభీర్ ప్రస్థానం మొదలైంది. ఈ పర్యటనలో భారత్ టీ20, వన్డే సిరీస్‌లు ఆడింది. టీ20 సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. కానీ వన్డే సిరీస్‌లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

మూడు వన్డేల సిరీస్‌లో శ్రీలంక 2-0తో భారత్‌ను ఓడించింది. వన్డే సిరీస్‌లో భారత్‌ను శ్రీలంక ఓడించడం 27 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఈ వన్డే సిరీస్ 2024లో భారత్‌కు చివరి వన్డే సిరీస్. ఈ ఏడాది భారత్ ఒక్క వన్డే సిరీస్‌ను కూడా గెలవలేకపోయింది. ఇది 45 ఏళ్ల చరిత్రలో తొలిసారి.

శ్రీలంక పర్యటన అనంతరం బంగ్లాదేశ్‌ జట్టు భారత పర్యటనకు వచ్చింది. టీ20 సిరీస్‌లో పటిష్ట ప్రదర్శన కనబర్చిన భారత్ 3-0తో బంగ్లాదేశ్‌ను ఓడించింది. బంగ్లాదేశ్‌ను టెస్ట్ సిరీస్‌లో కూడా 2-0తో భారత్ ఓడించింది, అయితే టీమ్ ఇండియా సమస్యలను ఎదుర్కొంది. చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా రాణించకపోతే భారత్‌ పరిస్థితి మరింత దిగజారిపోయేది. ఆ తర్వాత న్యూజిలాండ్‌ జట్టు భారత్‌ పర్యటనకు వచ్చింది. స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో శ్రీలంక న్యూజిలాండ్‌ను ఘోరంగా ఓడించింది. కివీస్‌ జట్టును భారత్‌ కూడా అలాగే ఓడిస్తుందని భావించారు కానీ అందుకు విరుద్ధంగా జరిగింది. న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 3-0తో భారత్‌ను క్లీన్ స్వీప్ చేసింది. భారత్‌లో మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఓ జట్టు భారత్‌ను క్లీన్‌స్వీప్ చేయడం ఇదే తొలిసారి. న్యూజిలాండ్ భారత్‌లో ఎన్నడూ టెస్టు సిరీస్ గెలవలేదు కానీ టామ్ లాథమ్ కెప్టెన్సీలో ఉన్న జట్టు ఈ ఘనత సాధించింది. ఈ క్రమంలో టీమ్ ఇండియాలో ఎన్నో లోపాలు కనిపించాయి. పుణె, ముంబయి టెస్టు మ్యాచ్‌ల్లో భారత్ గెలవడానికి రెండున్నర మూడు రోజులు మిగిలి ఉండగానే ఓడిపోయింది. స్వదేశంలో భారత్‌కు ఇంతకంటే పెద్ద గాయం ఏ జట్టు కూడా చేయలేదు.

గంభీర్ సారథ్యంలో ఎంపికలు, నిర్ణయాలు తీసుకుంటున్న తీరు ఆస్ట్రేలియాలో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో గెలుపుపై ప్ర‌భావితం చూప‌నుంది. ఈ సిరీస్‌కు కూడా గంభీర్ టీ20 క్రికెట్‌లో తమ సత్తాను ప్రదర్శించిన ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాడు, కానీ ఇంకా టెస్టుల్లో తమను తాము నిరూపించుకోలేకపోయారు ఆ ఆట‌గాళ్లు. బంగ్లాదేశ్ సిరీస్‌లో టీ20లో మెరిసిన ఆల్ రౌండర్ నితీశ్ రెడ్డిని ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపిక చేసినా లేదా టెస్టు జట్టులో హర్షిత్ రాణా ఎంపికైనా.. న్యూజిలాండ్‌పై ఓటమి తర్వాత తీవ్రమైన ప్రశ్నలను ఎదుర్కొన్నారు. ఈ నిర్ణ‌యాలే అతని కోచింగ్‌పై ప్రశ్నలు తలెత్తేల చేస్తున్నాయి. ఆస్ట్రేలియా టూర్‌లో భార‌త్‌ జట్టు నిరాశకు గురై.. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌ ఆడాలన్న కల చెదిరిపోతే.. గంభీర్‌పై ప్రశ్నల వర్షం, విమర్శల వర్షం కురుస్తుంది.


Next Story