అండర్-19 ఆసియా కప్ మనదే
India U19 won by 9 wickets. అండర్ 19 ఆసియా కప్ లో భారత జట్టు శ్రీలంక జట్టుపై ఘటన విజయం సాధించింది
By Medi Samrat
అండర్ 19 ఆసియా కప్ లో భారత జట్టు శ్రీలంక జట్టుపై ఘటన విజయం సాధించింది. శుక్రవారం నాడు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. మ్యాచ్ కు అడుగడుగునా వర్షం అడ్డంకిగా నిలవడంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం భారత్ విజయం సాధించినట్లు అంపైర్లు ప్రకటించారు. దుబాయ్ వేదికగా అండర్ 19 ఆసియా కప్ మ్యాచ్ లో భాగంగా ఫైనల్ లో శ్రీలంక – భారత జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన శ్రీలంక జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా 38 ఓవర్లకు మ్యాచ్ ను కుదించారు.
నిర్ణీత ఓవర్లకు ముగిసే సరికి లంక జట్టు 9 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. 107 లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఓపెనింగ్ కలిసి రాలేదు. ఓపెనర్ హర్నూర్ సింగ్ (5) తక్కువ స్కోరుకే అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ ఆంగ్రీష్ రఘువంశీ హాఫ్ సెంచరీ సాధించాడు. 56 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. షేక్ రషీద్ 31 పరుగులతో నాటౌట్ గా క్రీజులో ఉన్నాడు. మరోసారి వర్షం కురవడంతో ఇన్నింగ్స్ ను 32 ఓవర్లకు కుదించడమే కాకుండా..లక్ష్య చేధనను కూడా తగ్గించారు. 104 పరుగులకు చేయాల్సి వచ్చింది. 21.3 ఓవర్లలో భారత్ ఆటగాళ్లు టార్గెట్ ను చేధించారు.