భారత్-శ్రీలంక సిరీస్ కొత్త డేట్స్ ఇవే..

India Tour Of Srilanka Series Schedule Changed. ఈ నెల 13న శ్రీలంక, శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్

By Medi Samrat  Published on  10 July 2021 3:56 PM IST
భారత్-శ్రీలంక సిరీస్ కొత్త డేట్స్ ఇవే..

ఈ నెల 13న శ్రీలంక, శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడాల్సి ఉంది. ఈ టూర్ పై కూడా కరోనా ప్రభావం పడింది. ఇంగ్లండ్ పర్యటన నుంచి వచ్చిన లంక బృందంలో ఇద్దరికి కరోనా పాజిటివ్ గా తేలడంతో భారత్ తో సిరీస్ ను వాయిదా వేశారు. బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్, డేటా విశ్లేషకుడు నిరోషన్ కరోనా బారిన పడ్డారని శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారులు తెలిపారు. వారు ఆటగాళ్లతో కలిసే ఉండడంతో, లంక జట్టు మొత్తాన్ని క్వారంటైన్ కు తరలించారు. ముందు జాగ్రత్త చర్యగా సిరీస్ వాయిదా పడింది. బీసీసీఐ వర్గాలు ఇప్పటికే శ్రీలంకతో వన్డే సిరీస్ ను రీషెడ్యూల్ చేసినట్టు తెలిపాయి. ప్రస్తుతం లంక క్రికెటర్లు ఓ హోటల్లో క్వారంటైన్ లో ఉన్నట్టు తెలుస్తోంది.

తాజాగా రీ షెడ్యూల్ కు సంబంధించిన వివరాలను బీసీసీఐ తెలిపింది. శ్రీలంకతో సిరీస్ 18వ తేదీ నుండి మొదలుకాబోతోంది. కొలంబో వేదికగా 18, 20, 23 న మూడు వన్డేలు నిర్వహించనున్నారు. 25, 27, 29న మూడు టీ20 మ్యాచ్ లను నిర్వహించనున్నారు. టీమిండియాకు ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్ గా బాధ్యతలు చేపడుతున్నాడు. రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న టీమిండియా జట్టులో అందరూ యువ ప్లేయర్లు ఉన్నారు. వీరి ప్రదర్శన కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణంలో సిరీస్ వాయిదా పడింది.


Next Story