స్మృతి మంధాన 25 బంతుల్లో 51 నాటౌట్‌తో ముందుండి నడిపించడంతో భారత్ మహిళల ఆసియా కప్ ను సొంతం చేసుకుంది. శనివారం శ్రీలంకతో జరిగిన 66 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 8.3 ఓవర్లలో ఛేదించి ఏడోసారి మహిళల ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుంది. సిల్హెట్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలో భారత జట్టు శ్రీలంక జట్టును 9 వికెట్ల నష్టానికి 65 పరుగులకే పరిమితం చేసింది. రేణుకా సింగ్ ఠాకూర్ మూడు వికెట్లు తీయగా, రాజేశ్వరి గయక్వాడ్, స్నేహ రాణా చెరో రెండు వికెట్లు తీశారు. శ్రీలంక ఇన్నింగ్స్ లో రణవీర 18 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. రణసింఘే 13 పరుగులు చేసింది.
భారత జట్టు సునాయాసంగా లక్ష్యాన్ని చేధించింది. కేవలం రెండు వికెట్లు కోల్పోయి.. భారత్ విజయాన్ని అందుకుంది. స్మృతి మందనా 25 బంతుల్లో 51 పరుగులు చేసి భారత్ కు విజయాన్ని అందించింది. మందన ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. హర్మన్ ప్రీత్ 11 పరుగులతో నాటౌట్ గా నిలిచింది. షెఫాలీ వర్మ 5 పరుగులు, జెమీమా కేవలం రెండు పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు.