మొద‌టి టీ20లో టీమిండియా విక్ట‌రీ

India thrash Ireland by 7 wickets. దీపక్ హుడా, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్ రాణించడంతో

By Medi Samrat  Published on  27 Jun 2022 4:13 AM GMT
మొద‌టి టీ20లో టీమిండియా విక్ట‌రీ

దీపక్ హుడా, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్ రాణించడంతో ఐర్లాండ్‌తో జరిగిన మొద‌టి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ విజయంతో స్టాండ్-ఇన్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. 12 ఓవర్లలో 109 పరుగుల లక్ష్యాన్ని భారత్ 16 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్‌ను 12 ఓవ‌ర్ల‌కు కుదించారు.

12 ఓవర్ల గేమ్‌లో భారత్ 9.2 ఓవ‌ర్ల‌లోనే 3 వికెట్లు కోల్పోయి 111 ప‌రుగులు చేసి విజ‌య‌లక్ష్యాన్ని చేధించింది. భార‌త బ్యాట్స్‌మెన్‌ల‌లో దీప‌క్ హుడా 47(నాటౌట్‌) రాణించ‌గా, ఇషాన్‌ కిషన్ 26, హార్దిక్ పాండ్యా 24 ప‌రుగులు చేసి రాణించారు. ఐర్లాండ్ బౌల‌ర్ల‌లో యంగ్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. అంత‌కుముందు ఐర్లాండ్ 12 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లకు 108 చేసింది. ఐర్లాండ్ బ్యాట్స్‌మెన్‌ల‌లో టెక్టర్ 64 రాణించాడు. భార‌త బౌల‌ర్ల‌లో చాహల్, భువనేశ్వర్ త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.


Next Story
Share it