భారత టెస్టు క్రికెట్‌లో నూతన శకం ప్రారంభం.. ఇంగ్లండ్ టూర్‌కు జట్టు ప్రకటన
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత భారత టెస్టు క్రికెట్‌లో కొత్త శకం మొదలైంది.
By Medi Samrat
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత భారత టెస్టు క్రికెట్‌లో కొత్త శకం మొదలైంది. జూన్ 20 నుంచి ఇంగ్లండ్ టూర్ తో టూర్ ప్రారంభం కానుంది.టెస్ట్ సిరీస్ కోసం బీసీసీఐ శనివారం జట్టును ప్రకటించింది. కొత్త కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ నాలుగో ఎడిషన్‌ను భారత్ యువ జట్టుతో ప్రారంభించనుంది. టెస్టుల నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత.. యువ శుభ్‌మన్ గిల్ కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అదే సమయంలో రిషబ్ పంత్‌ని వైస్ కెప్టెన్‌గా నియమించారు.
విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ తర్వాత అతని స్థానంలో సాయి సుదర్శన్ ఎంపికయ్యాడు. భారత జట్టులో అనుభవజ్ఞులైన ఇద్దరు ఆటగాళ్లు రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా మాత్రమే. అంతేకాకుండా కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్‌లకు కూడా జట్టులో చోటు కల్పించారు.
జస్ప్రీత్ బుమ్రా ఫాస్ట్ బౌలింగ్ అటాక్‌కు నాయకత్వం వహిస్తాడు. అర్ష్‌దీప్ సింగ్ తొలిసారి టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. వీరిద్దరితో పాటు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, శార్దూల్ ఠాకూర్‌లు కూడా చోటు దక్కించుకున్నారు.
ఇంగ్లండ్ పర్యటనకు భారత జట్టు
శుభమన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురైల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్‌దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.