ఆసియా క‌ప్‌కు భార‌త జ‌ట్టు ఎంపిక‌.. కోహ్లీ, రాహుల్ రీఎంట్రీ.. బుమ్రా దూరం

India Squad For Asia Cup 2022 Announced.దుబాయ్ వేదిక‌గా ఈ నెల 27 నుంచి ఆసియా క‌ప్ టోర్నీ జ‌ర‌గ‌నున్న సంగ‌తి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Aug 2022 5:06 AM GMT
ఆసియా క‌ప్‌కు భార‌త జ‌ట్టు ఎంపిక‌.. కోహ్లీ, రాహుల్ రీఎంట్రీ.. బుమ్రా దూరం

దుబాయ్ వేదిక‌గా ఈ నెల 27 నుంచి ఆసియా క‌ప్ టోర్నీ జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ టోర్నీలో పాల్గొనే భార‌త జ‌ట్టును భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఎంపిక చేసింది. 15 మందితో కూడిన జ‌ట్టును ప్ర‌క‌టించింది. ఇంగ్లాండ్ సిరీస్ త‌రువాత వెస్టిండిస్ టూర్‌కి విరామం తీసుకున్న విరాట్ కోహ్లీ, గాయం నుంచి కోలుకున్న రాహుల్‌లు తిరిగి జట్టులోకి వచ్చారు. శ్రేయస్‌ అయ్యర్‌, అక్షర్‌ పటేల్‌. దీపక్‌ చాహర్ లు స్టాండ్‌ బై ప్లేయర్లుగా ఎంపికయ్యారు. గాయం కార‌ణంగా కీల‌క బౌల‌ర్లు బుమ్రా, హ‌ర్ష‌ల్ ప‌టేల్ లు దూరం అయ్యారు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రూ బెంగ‌ళూరులోని జాతీయ క్రికెట్ అకాడ‌మీలో కోలుకుంటున్న‌ట్లు బీసీసీఐ తెలిపింది.

ఆసియా కప్‌కు భారత జట్టు ఇదే..

రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్‌ కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్‌ పంత్ (వికెట్‌ కీపర్‌), దినేష్ కార్తీక్ (వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, వై చాహల్, ఆర్ బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్ , అర్ష‌దీప్‌సింగ్, అవేష్ ఖాన్

యూఏఈ వేదిక‌గా ఈ నెల 27 నుంచి సెప్టంబ‌ర్ 11 వ‌ర‌కు యూఏఈ వేదిక‌గా ఆసియా క‌ప్ పోటీలు జ‌ర‌గ‌నున్నాయి. మొత్తం ఆరు జట్లను రెండు గ్రూపులు విభ‌జించారు. గ్రూప్ ఏలో భార‌త్‌, పాకిస్థాన్‌, క్వాలిఫ‌య‌ర్ జ‌ట్టు ఉండ‌గా.. గ్రూప్ బిలో శ్రీలంక, బంగ్లాదేశ్‌, ఆఫ్గానిస్థాన్ జ‌ట్లు ఉన్నాయి. భార‌త త‌న తొలి మ్యాచ్ ఆగ‌స్టు 28న దాయాది పాకిస్థాన్‌తో త‌ల‌ప‌డ‌నుంది. గ‌తేడాది టీ20 ప్ర‌పంచ‌క‌ప్ టోర్నీలో పాక్ చేతిలో ఎదురైనా ప‌రాభ‌వానికి టీమ్‌ ఇండియా ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని అభిమానులు భావిస్తున్నారు.


Next Story
Share it