ఆ పిచ్‌లో అలానే ఆడాలి..బుమ్రా, సిరాజ్‌పై సచిన్ ప్రశంసలు

టీమిండియా సౌతాఫ్రికా టూర్‌ను ముగించింది. అక్కడ సఫారీలతో టీ20, వన్డే, టెస్టు సిరీస్‌లను ఆడింది.

By Srikanth Gundamalla  Published on  5 Jan 2024 11:23 AM IST
india, south africa, cricket, sachin,

 ఆ పిచ్‌లో అలానే ఆడాలి..బుమ్రా, సిరాజ్‌పై సచిన్ ప్రశంసలు

టీమిండియా సౌతాఫ్రికా టూర్‌ను ముగించింది. అక్కడ సఫారీలతో టీ20, వన్డే, టెస్టు సిరీస్‌లను ఆడింది. అయితే.. ఇందులో ఏ సిరీస్‌ను కోల్పోలేదు భారత్. వన్డే సిరీస్‌ను గెలవగా.. టీ20, టెస్టు సిరీస్‌లను సమం చేసింది. తద్వారా భారత్‌ దక్షిణాఫ్రికా పర్యటనను దిగ్విజయంగా పూర్తి చేసింది. ఇక రెండో టెస్టు మ్యాచ్‌ కేప్‌టౌన్‌లో జరిగిన విషయం తెలిసిందే. కేవలం ఈ మ్యాచ్‌ ఒకటిన్నర రోజులోనే ముగిసింది. 650 బంతుల్లోపే ఈ రెండో టెస్టు పూర్తయింది. కేప్‌టౌన్‌ భారత బౌలర్లు అద్భుతంగా రాణించడంతో ఘనవిజయాన్ని అందుకుంది టీమిండియా. దాంతో.. భారత్‌ గెలుపుపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ టూర్‌పై క్రికెట్ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ కూడా స్పందించారు. భారత ఆటగాళ్లను అభినందించారు.

దక్షిణాఫ్రికా టూర్‌లో అద్భుతంగా రాణించిన ఆటగాళ్లకు ఎక్స్ వేదికగా సచిన్ టెండూల్కర్ శుభాకాంక్షలు తెలిపారు. రెండో టెస్టు మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన బుమ్రా, సిరాజ్‌లను ఆటతీరును కొనియాడారు. మ్యాచ్‌ మొత్తం ఏమాత్రం పట్టువిడవకుండా ఇద్దరూ బౌలింగ్ చేశారనీ అన్నారు టెండూలకర్. ఇలాంటి నిలకడైన ఆటతీరు మున్ముందు మ్యాచుల్లో కూడా కొనసాగించడం అవసరమని అన్నారు. ఇక సౌతాఫ్రికా ఆటగాడు మార్క్రమ్ ఆడిన విధానం కూడా బాగుందన్నారు. అందరూ విఫలమవుతున్నా అతను సెంచరీ చేసిన విధానం గొప్పగా ఉండన్నారు సచిన్. కేప్‌టౌన్ వంటి పిచ్‌పై ఒక్కోసారి బ్యాటింగ్ దూకుడా చేయాల్సి ఉంటుందని ఎక్స్‌ వేదికగా సచిన్ టెండూల్కర్ పోస్టు పెట్టారు.

రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో సిరాజ్‌ బౌలింగ్‌తో సౌతాఫ్రికా కుప్పకూలింది. ఏకంగా ఆరు వికెట్లు తీశాడు. దాంతో.. సిరాజ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ దక్కింది. ఇక ఈ టెస్టు సరీస్‌లో అద్భుతంగా రాణించిన బుమ్రాకు ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు దక్కింది.


Next Story