టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్టులో నాలుగు మార్పులు.. దక్షిణాఫ్రికా 36/2
India opt to bowl in 3rd ODI against South Africa.కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన మూడో వన్డేలో భారత్
By తోట వంశీ కుమార్ Published on 23 Jan 2022 2:38 PM ISTకేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన మూడో వన్డేలో భారత్ టాస్ గెలిచింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ సౌతాఫ్రికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. మూడు వన్డేల మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే రెండు వన్డేలు గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న సౌతాఫ్రికా ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి.. టీమ్ఇండియాను వైట్ వాష్ చేయాలని బావిస్తుండగా.. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భారత జట్టు ఆరాటపడుతోంది.
ఈ క్రమంలో తుది జట్టులో నాలుగు మార్పులు చేసింది టీమ్ఇండియా. రెండు మ్యాచుల్లో విఫలం అయిన అశ్విన్, భువనేశ్వర్, వెంకటేష్ అయ్యర్, శార్ధూల్ ఠాకూర్ లపై వేటు వేసింది. వారి స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్, జయంత్ యాదవ్, ప్రసిద్ద్ కృష్ణ, దీపక్ చాహర్‌లు తుది జట్టులోకి వచ్చారు. ఇక దక్షిణాఫ్రికా జట్టు ఫెలుక్వాయో స్థానంలో ప్రిటోరిస్‌ను తీసుకుంది.
కాగా.. బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ మలాన్(1) ను దీపక్ చాహర్ పెవిలియన్ చేర్చాడు. దీంతో 8 పరుగుల వద్ద సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ క్వింటన్ డికాక్, కెప్టెన్ బవుమాతో కలిసి భారత బౌలర్ల పైకి ఎదురుదాడికి దిగాడు. అయితే.. కేఎల్ రాహుల్ విసిరిన డైరెక్టుత్రోకి బువమా(8) రనౌట్ అయ్యాడు. దీంతో దక్షిణాఫ్రికా స్కోర్ 32 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 7 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా స్కోర్ 36/2. క్రీజులో క్వింటన్ డికాక్ 26 తోపాటు మార్‌క్రమ్(0) ఉన్నారు.
భారత జట్టు..
కేఎల్ రాహుల్ (కెప్టెన్), బుమ్రా (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, జయంత్ యాదవ్, ప్రసిద్ద్ కృష్ణ, దీపక్ చాహర్, బుమ్రా, చాహల్
దక్షిణాఫ్రికా జట్టు..
బవుమా (కెప్టెన్), డికాక్, జె.మలాన్, మర్‌క్రమ్, డస్సెన్, డేవిడ్ మిల్లర్, ఫెలుక్వాయో, మగాలా, కేశవ్ మహారాజ్, ప్రిటోరిస్, ఎంగిడి