టెస్టు సిరీస్‌ను కోల్పోయి, కనీసం వన్డే సిరీస్‌నైనా చేజిక్కించుకోవాలని ఆరాటపడుతున్న టీమ్ఇండియా కీలకమైన రెండో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వన్డేలో ఓడినప్పటికి జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు. ఆల్‌రౌండర్ కేటగిరిలో వెంకటేష్ అయ్యర్‌ను ఎంచుకోవడంపై విమర్శలు వచ్చినా.. జట్టు మేనేజ్‌మెంట్ మరోసారి అతడికి అవకాశం ఇచ్చింది. రాహుల్ నాయకత్వ సామర్థ్యంపైనా అనేక ప్రశ్నలు తలెత్తున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం అత్యవసరం. ప్రస్తుతం నాలుగు ఓవర్లు ముగిసే సరికి భారత స్కోర్ 26/0. కెప్టెన్ రాహుల్ 8, శిఖర్ దావన్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు.
భారత జట్టు :
కేఎల్ రాహుల్ (కెప్టెన్), బుమ్రా (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, అశ్విన్, భువనేశ్వర్, యుజ్వేంద్ర చాహల్
దక్షిణాఫ్రికా జట్టు :
బవుమా (కెప్టెన్), డికాక్, జె.మలాన్, మర్‌క్రమ్, డస్సెన్, డేవిడ్ మిల్లర్, ఫెలుక్వాయో, మగాలా, కేశవ్ మహారాజ్, షాంసీ, ఎంగిడి