టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్.. అయ్య‌ర్‌కు నో ప్లేస్‌

India opt to bat against South Africa.సెంచూరియ‌న్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో ప్రారంభ‌మైన తొలి టెస్టులో భార‌త జ‌ట్టు .

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Dec 2021 8:38 AM GMT
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్.. అయ్య‌ర్‌కు నో ప్లేస్‌

సెంచూరియ‌న్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో ప్రారంభ‌మైన తొలి టెస్టులో భార‌త జ‌ట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వ‌న్డే కెప్టెన్సీ నుంచి ఉద్వాస‌న‌కు గురైన త‌రువాత కెప్టెన్ విరాట్ కోహ్లీకి, హెడ్ కోచ్‌గా ద్రావిడ్‌కు విదేశాల్లో ఇదే తొలి సిరీస్ కావ‌డంతో దీనిపై అంద‌రి దృష్టి నెల‌కొంది. ఇప్ప‌టి వ‌ర‌కు సౌతాఫ్రికా గ‌డ్డ‌పై ఒక్క సారి కూడా టెస్టు సిరీస్‌ను భార‌త జ‌ట్టు గెల‌వ‌లేదు. ఈసారి గెలిచి రికార్డు సృష్టించాల‌ని ఆట‌గాళ్లు బావిస్తున్నారు.

ఇక ఫామ్‌లో లేన‌ప్ప‌టికి సీనియ‌ర్ ఆట‌గాళ్ల అజింక్యా ర‌హానే, పుజారాకు మ‌రో అవ‌కాశం ఇచ్చారు. స్వ‌దేశంలో కివీస్‌తో టెస్టు సిరీస్‌తో అద‌ర‌గొట్టిన శ్రేయాస్ అయ్య‌ర్ ను ప‌క్క‌న‌పెట్టారు. గ‌త కొంత‌కాలంగా వికెట్లు తీయ‌లేక‌పోతున్న ఇషాంత్ శ‌ర్మకు చోటు ద‌క్క‌లేదు. అత‌డి స్థానంలో మ‌హ్మ‌ద్ సిరాజ్ ఆడుతున్నారు. ఇక సెంచూరియ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్ రెండు టెస్టులు ఆడ‌గా.. రెండింటిలో ఓట‌మి పాలైంది. ప్ర‌స్తుతం 8 ఓవ‌ర్లు ముగిసే స‌రికి భార‌త్ వికెట్ న‌ష్ట‌పోకుండా 16 ప‌రుగులు చేసింది. క్రీజులో ఓపెన‌ర్ రాహుల్ 5, మ‌యాంక్ అగ‌ర్వాల్ 11 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నాడు.

భార‌త జ‌ట్టు : కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, పుజారా, విరాట్ కోహ్లి(కెప్టెన్‌), అజింక్యా రహానే, రిషబ్ పంత్(వికెట్ కీప‌ర్‌), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు : డీన్ ఎల్గర్(కెప్టెన్‌), ఐడెన్ మార్క్రామ్, కీగన్ పీటర్సన్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, టెంబా బావుమా, క్వింటన్ డి కాక్(వికెట్ కీప‌ర్), వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబడ, లుంగి ఎన్గిడి

Next Story
Share it