కివీస్‌తో వ‌న్డే సిరీస్‌.. జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ..!

జనవరి 11 నుండి న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల ODI సిరీస్ కోసం భారత జట్టును శనివారం ప్రకటించారు.

By -  Medi Samrat
Published on : 3 Jan 2026 5:20 PM IST

కివీస్‌తో వ‌న్డే సిరీస్‌.. జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ..!

జనవరి 11 నుండి న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల ODI సిరీస్ కోసం భారత జట్టును శనివారం ప్రకటించారు. శుభ్‌మాన్ గిల్ తిరిగి కెప్టెన్‌గా క‌నిపించ‌నున్నాడు. శ్రేయాస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా ఉంటాడు. అయితే.. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఫిట్‌నెస్ సర్టిఫికేట్ పొందిన తర్వాత అయ్యర్ ఆడనున్న‌ట్లు కనిపిస్తుందని బీసీసీఐ స్పష్టం చేసింది. కొత్త సంవత్సరం ప్రారంభం భారత క్రికెట్ అభిమానులకు ప్రత్యేకం కానుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరోసారి మైదానంలో క‌న‌బ‌డ‌నున్నారు. వీరిద్దరూ ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేశారు.

ఈ జట్టులో యువ బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు చోటు దక్కలేదు. రాయ్‌పూర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అత‌డు అద్భుత సెంచరీ చేశాడు. అయినా కూడా సెలక్టర్లు అతడిని తప్పించారు. సెలక్షన్ కమిటీ హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతినిచ్చింది. వీరిద్దరూ ఫిబ్రవరిలో జరిగే టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు.

జనవరి 11 నుంచి భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుండగా.. తొలి మ్యాచ్ వడోదరలో జరగనుంది. రెండో మ్యాచ్‌ జనవరి 14న రాజ్‌కోట్‌లో జరగనుండగా, మూడో మ్యాచ్‌లో ఇరు జట్లు జనవరి 18న తలపడనున్నాయి. దీని తర్వాత ఇరు జట్లు ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఆడనున్నాయి.

భారత జట్టు :

శుభ్‌మన్ గిల్ (c), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, KL రాహుల్ (wk), శ్రేయాస్ అయ్యర్ (vc), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి.

Next Story