ఒలింపిక్స్ కోసం బిడ్ వేయబోతున్న భారత్
India is going to bid for the Olympics. ఒలింపిక్స్ ను నిర్వహించాలని ప్రతి దేశం తహ తహ లాడుతూ ఉంటుంది.
By M.S.R Published on 28 Dec 2022 8:30 PM ISTఒలింపిక్స్ ను నిర్వహించాలని ప్రతి దేశం తహ తహ లాడుతూ ఉంటుంది. ఆ లిస్టులో భారత్ కూడా ఉంది. ఒలింపిక్స్ నిర్వహించడం కోసం భారత్ కూడా ఎన్నో ఏళ్లుగా పరితపిస్తూ ఉంది. అయితే అనుకున్నట్లుగా ప్రణాళికలు రచించడంలో ప్రభుత్వాలు విఫలమవుతూ వస్తున్నాయి. అనుకున్నట్లు జరిగితే 14 సంవత్సరాల తర్వాత ఒలింపిక్స్ భారత్ లో నిర్వహించవచ్చు. ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే స్థాయిని భారత్ 2036 లో అందుకుంటుందని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధంగా ఉందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. దీన్ని సాధించేందుకు ఇండియన్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) కి రోడ్‌మ్యాప్ ఇస్తామని చెప్పారు. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) క్రీడల నిర్వహణకు ప్రభుత్వం మద్దతు ఇస్తుందని, గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలతో ఆతిథ్య నగరంగా మారుతుందని ఠాకూర్ చెప్పారు. గతంలో 1982 ఆసియా క్రీడలు, 2010 కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇచ్చిందని కేంద్ర మంత్రి గుర్తుచేశారు. ఇప్పుడు భారత్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమైందన్నారు. జీ 20 ప్రెసిడెన్సీని భారత్ ఇంత పెద్ద స్థాయిలో నిర్వహించగలిగినప్పుడు ఐఓఏతో కలిపి కేంద్ర ప్రభుత్వం ఒలింపిక్స్ నిర్వహించగలదని భావిస్తున్నట్లు అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఒలింపిక్స్‌కు పూర్తిగా సిద్ధమైన తర్వాతనే భారత్ బిడ్ వేస్తుందని తెలిపారు.