మేము ప్రపంచకప్ గెలిచేందుకు రాలేదు.. భారత్‌ను ఓడించేందుకు వచ్చాం:షకీబ్
"India Here To Win T20 World Cup, We Are Not" Bangladesh Captain Shakib Al Hasan.బంగ్లాదేశ్ జట్టుతో టీమ్ఇండియా
By తోట వంశీ కుమార్ Published on 1 Nov 2022 8:59 AM GMTఅడిలైట్ వేదికగా రేపు(బుధవారం) బంగ్లాదేశ్ జట్టుతో టీమ్ఇండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సెమీస్ అవకాశాలను మరింత మెరుగుపరచుకోవాలని ఇరు జట్లు బావిస్తున్నాయి. ఈ రెండు జట్లు చెరో మూడు మ్యాచ్‌లు ఆడి రెండేసి విజయాలతో పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. 4 పాయింట్లతో ఇరు జట్లు సమానంగా ఉన్నప్పటికి రన్‌రేట్‌లో కాస్త మెరుగ్గా ఉన్న టీమ్ఇండియా రెండో స్థానంలో ఉంది.
వరుణుడి ఆటంకం..
అయితే.. ఈ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదే జరిగితే ఇరు జట్ల సెమీస్ అవకాశాలపై తీవ్ర ప్రభావం పడనుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో భారత్ ఓడిపోయింది. బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే చెరో పాయింట్ వస్తుంది. అలా జరిగితే జింబాబ్వేతో జరిగే మ్యాచ్ లో భారత్ తప్పక గెలవాలి.
వరల్డ్ కప్ గెలిచేందుకు రాలేదు..
ఇదిలా ఉంటే.. భారత్‌తో మ్యాచ్‌కు ముందు బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాము ఆస్ట్రేలియాకు వచ్చింది ప్రపంచకప్‌ను గెలిచేందుకు కాదని, టీమ్ఇండియాను ఓడించేందుకే ఇక్కడకు వచ్చామన్నారు. భారత్‌ను ఓడిస్తే అదే తమకు ప్రపంచకప్‌తో సమానం అని అన్నాడు. ప్రపంచకప్‌లో ప్రతీ మ్యాచ్ కీలకమేనని, ప్రత్యర్థి ఎవరు అనేది తాము పట్టించుకోమని చెప్పాడు. జట్టుగా వంద శాతం పెర్ఫార్మ్ చేయడంపైనే దృష్టి సారించామన్నాడు. భారత్, పాక్‌లలో ఒక్క జట్టునైనా అప్ సెట్ చేస్తామన్న ధీమా వ్యక్తం చేశాడు. భారత్ ఇక్కడకు ప్రపంచకప్ గెలిచేందుకు వచ్చింది. అలాంటి జట్టును ఓడిస్తే వచ్చే కిక్కే వేరని, ఇందుకోసం సర్వశక్తులు ఒడ్డుతామన్నాడు. ప్రస్తుతం షకీబ్ చేసిన వ్యాక్యలు క్రికెట్ వర్గాల్లో హాట్ టాఫిక్‌గా మారాయి.