2026 T20 వరల్డ్ కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘనవిజయం సాధించి, వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ వేగవంతమైన బౌలర్ షోయబ్ అక్తర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ క్రికెట్‌ను 'నాశనం' చేస్తోందని అక్తర్ ఆరోపించారు. భారత్‌ను ఒక వీధిలో ఉండే 'ధనిక పిల్లాడి'తో అక్తర్ పోల్చారు. ఆ పిల్లాడు మిగిలిన పేద పిల్లలందరినీ పిలిచి ఆడుకుందాం అని చెప్పి, తన దగ్గర ఉన్న వనరులతో తానే గెలుస్తూ, చివరకు చూడండి నేనే గెలిచాను అని చెప్పుకున్నట్లు భారత్ వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. ఐదు-ఎనిమిది జట్లు ఉంటే, అందులో తనకు నచ్చిన జట్లనే పిలిచి ఆడిస్తూ భారత్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోందని, దీనివల్ల క్రికెట్‌లో పోటీతత్వం తగ్గిపోతోందని విమర్శించారు. ఫైనల్‌కు ముందు అక్తర్ మాట్లాడుతూ.. భారత్ ఫేవరెట్ అని ఒప్పుకుంటూనే, క్రికెట్ బాగుండాలంటే ఈసారి న్యూజిలాండ్ గెలవాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. కానీ భారత్ 96 పరుగుల భారీ తేడాతో గెలవడంతో ఈ వ్యాఖ్యలు చేశారు.