టీమిండియా WTC ఫైనల్స్‌కు చేరాలంటే చాలా మ్యాచ్‌లు గెలవాల్సిందే..!

తొలి టెస్టులో దక్షిణాఫ్రికా చేతిలో భారత జట్టు 30 పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

By -  Medi Samrat
Published on : 17 Nov 2025 6:44 PM IST

టీమిండియా WTC ఫైనల్స్‌కు చేరాలంటే చాలా మ్యాచ్‌లు గెలవాల్సిందే..!

తొలి టెస్టులో దక్షిణాఫ్రికా చేతిలో భారత జట్టు 30 పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత WTC ఫైనల్‌కు చేరుకోవడం కష్టంగా మారింది. తాజా WTC పాయింట్ల పట్టికలో టీమ్ ఇండియా నాల్గవ స్థానంలో ఉంది. ఇంకా 10 టెస్టులు మిగిలి ఉన్నాయి. ప్రస్తుత WTC సైకిల్‌లో టీమ్ ఇండియా 8 మ్యాచ్‌ల ద్వారా 52 పాయింట్లు 54.17 పాయింట్ల శాతాన్ని కలిగి ఉంది. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు చేరుకోవాలంటే మరిన్ని పరాజయాలను తప్పించుకోవాల్సి ఉంటుంది.

WTC పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు అగ్రస్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా, శ్రీలంక వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. నాలుగు విజయాలు సాధించినా కష్టాల్లో కూరుకుపోయిన‌ భారత జట్టు.. సొంతగడ్డపై పేలవ ప్రదర్శనతో ఫైనల్ చేరే మార్గానికి అడ్డంకిగా మారింది.

WTC ఫైనల్‌కు చేరాలంటే భార‌త్ సొంతగడ్డపై సాధ్యమైనంత వరకు గెలవాలి. ప్రస్తుత WTC సైకిల్‌లో భారత జట్టుకు 10 టెస్టులు మిగిలి ఉన్నాయి. వీటిని మూడు టెస్ట్ సిరీస్‌లుగా విభజించారు. ప్రతి సిరీస్, మ్యాచ్ వెయిటింగ్ పాయింట్ల ప్రకారం ఉంటుంది.

భారత్‌కు మిగిలిన టెస్టు మ్యాచ్‌లు

vs దక్షిణాఫ్రికా (హోమ్) – 1వ టెస్ట్ (గౌహతి)

vs శ్రీలంక (దూరంగా) – 2 టెస్టులు

vs న్యూజిలాండ్ (దూరంగా) - 2 టెస్టులు

vs ఆస్ట్రేలియా (హోమ్) - ఐదు టెస్టులు

ఈ 10 టెస్టుల మొత్తం పాయింట్లు 120. మొత్తం సైకిల్ గురించి మాట్లాడుకుంటే.. భారత్ 18 మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది.. అందులో మొత్తం 216 పాయింట్లు ఉన్నాయి. ఏ మ్యాచ్‌ కూడా డ్రా కాలేదనుకుంటే భారత్‌ నిర్ణయాత్మక శాతం గెలుపుపై ​​ఆధారపడి ఉంటుంది.

ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ప్రస్తుత ఫామ్ చూస్తుంటే.. టాప్-2 స్థానాలకు కటాఫ్ 64-68 శాతం ఉంటుందని తెలుస్తోంది. అంటే రాబోయే 10 టెస్టుల్లో భారత్ కనీసం 7 టెస్టుల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. ఇందులో కొన్ని డ్రా అయ్యే మ్యాచ్‌లు కూడా ఉంటాయి. దీని కారణంగా భారత్ ప‌ర్సంటేజీ 64-65 శాతానికి చేరుకుంటుంది. ఎనిమిది విజయాలతో భారత్ ప‌ర్సంటేజీ 68.52 అవుతుంది. అంటే ఫైనల్స్‌కు చేరుకోవడం దాదాపు గ్యారెంటీ.

డ్రా అయిన మ్యాచ్‌లు తలనొప్పిని పెంచుతాయి. కానీ సరళమైన భాషలో అర్థం చేసుకుంటే.. భారత్ ఎనిమిది మ్యాచ్‌లు గెలవాలి. దాని కారణంగా 52 పాయింట్లు, 4 డ్రాలు ఉంటాయి. అప్పుడు పాయింట్లు 216తో భాగించబడతాయి, అది శాతాన్ని ఇస్తుంది. ఉదాహరణకు, ఏడు విజయాలు, ఒక డ్రా, రెండు ఓటములతో 140 పాయింట్లు వస్తాయి. ఇది 216లో 64.81 శాతం. భారత్ WTC ఫైనల్‌కు చేరుకోవాలంటే, ఏడు మ్యాచ్‌లు గెలవాలి. ఇందులో ఒక డ్రా, రెండు పరాజయాలు ఉన్నా ప‌ర్వాలేదు.

Next Story