ఇండియన్ ప్రీమియర్ లీగ్ పూర్తయిన తర్వాత భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడబోతోంది. అయితే ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియాను భారత్ వెనక్కు నెట్టి నెంబర్ వన్ జట్టుగా అవతరించింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మంగళవారం, మే 2న భారత్ టెస్టుల్లో నంబర్ 1 ర్యాంకును సొంతం చేసుకుందని తెలిపింది. తాజాగా భారతదేశం అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా 1-2 తేడాతో ఓడిపోయింది. 15 నెలల పాటు కొనసాగిన ఆస్ట్రేలియా ఆధిపత్యానికి తెరపడింది. 25 మ్యాచ్‌ల్లో భారత్ 3031 పాయింట్లు సాధించింది. టీమిండియా రేటింగ్ 121గా నిలిచింది. ఈ విధంగా భారత్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా చాలా కాలంగా నంబర్ 1 స్థానంలో ఉండగా.. ఇప్పుడు రెండో స్థానానికి వచ్చింది. ఆస్ట్రేలియా 23 మ్యాచ్‌ల్లో 2679 పాయింట్లు సాధించింది. వారి ఖాతాలో 116 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. దీంతో రెండవ స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్ మూడు, దక్షిణాఫ్రికా నాలుగు, న్యూజిలాండ్ ఐదో స్థానంలో ఉంది.