శిఖర్ ధవన్ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలు లీక్.. ఎవరు చేస్తున్నారంటే..?

India Cricketer Claims Aesha Mukerji Threatened to Defame him. తన ఇమేజ్, కెరీర్‌ను నాశనం చేస్తానని తన మాజీ భార్య అయేషా ముఖర్జీ బెదిరిస్తోందని

By Medi Samrat  Published on  6 Feb 2023 3:45 PM IST
శిఖర్ ధవన్ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలు లీక్.. ఎవరు చేస్తున్నారంటే..?

తన ఇమేజ్, కెరీర్‌ను నాశనం చేస్తానని తన మాజీ భార్య అయేషా ముఖర్జీ బెదిరిస్తోందని టీమిండియా క్రికెటర్ శిఖర్ ధవన్ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తన IPL ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యానికి తన పరువుకు నష్టం కలిగించే సందేశాలను పంపించిందని ఆరోపించాడు ధవన్. తన పరువుకు భంగం కలిగించేలా విష ప్రచారం చేస్తుందని, తన స్నేహితులు, క్రికెట్‌కు సంబంధించిన వ్యక్తులకు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమాచారాన్ని షేర్‌ చేస్తోందని న్యూఢిల్లీలోని పటియాలా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. ఆధారాలను కోర్టులో సమర్పించాడు. తన పరువుకు భంగం కలిగించే సమాచారాన్ని సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తానని బెదిరిస్తుందని వాపోయాడు. అయితే ఇలాంటి పనులను మానుకోవాలని శిఖర్ ధవన్ భార్యను ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు సూచించింది. అయేషా-ధావన్‌కు ఒక కుమారుడు ఉన్నాడు, అతను ప్రస్తుతం ఆస్ట్రేలియాలో అయేషా ముఖర్జీ కస్టడీలో ఉన్నాడు.

Next Story