ఇంజమామ్ ఆరోపణలపై ఎదురుదాడికి దిగిన షమీ

టీ20 ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియాతో భారత్ సూపర్ 8 మ్యాచ్ తర్వాత ఇంజమామ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 July 2024 2:53 PM IST
india, cricket, shami,  inzamam ul haq, ball tampering ,

ఇంజమామ్ ఆరోపణలపై ఎదురుదాడికి దిగిన షమీ 

T20 ప్రపంచ కప్ 2024 సందర్భంగా రివర్స్ స్వింగ్‌ను సృష్టించగల యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ పై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ ఆరోపణలు చేయడంతో తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. తాజాగా భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ తన సహచరుడు అర్ష్‌దీప్ సింగ్‌కు మద్దతు ఇచ్చాడు. ఇంజమామ్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఇప్పటికే ఎంతోమంది కౌంటర్లు వేయగా.. ఇంజమామ్ వ్యాఖ్యలపై షమీ ఎదురుదాడికి దిగాడు.

టీ20 ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియాతో భారత్ సూపర్ 8 మ్యాచ్ తర్వాత ఇంజమామ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్ లో అర్ష్‌దీప్ మూడు కీలక వికెట్లు తీయడం ద్వారా భారతదేశం 24 పరుగుల తేడాతో విజయాన్ని దక్కించుకుంది. ఈ మ్యాచ్ లో అద్భుతమైన బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైనప్పటికీ, అర్ష్‌దీప్ స్పెల్‌ పై ప్రశంసలు కురిపించాడు. అర్ష్ దీప్ డేవిడ్ వార్నర్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్‌లను అవుట్ చేశాడు.

అయితే అర్ష్‌దీప్ రివర్స్ స్వింగ్‌పై ఇంజమామ్ సందేహాన్ని వ్యక్తం చేశాడు. 14వ లేదా 15వ ఓవర్‌లో బౌలర్‌ రివర్స్ స్వింగ్ చేయడం అసాధారణమని అన్నాడు. శుభంకర్ మిశ్రా యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షమీ.. ఇంజమామ్ వాదనలను తప్పుబట్టారు. రివర్స్ స్వింగ్‌లో నైపుణ్యానికి పేరుగాంచిన షమీ ఇంజీ ఆరోపణలను తోసిపుచ్చాడు . ‘అర్ష్‌దీప్‌ సింగ్‌కి రివర్స్‌ స్వింగ్‌ ఎలా వస్తుంది?’ అని అడుగుతున్న ఇంజమామ్‌ భాయ్‌కి నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. బంతికి కట్టించడం గ్రౌండ్ లో అవుతుందా? అసలు అది చేస్తే చూస్తున్న వాళ్లు ఊరికే ఉంటారా అని ప్రశ్నించాడు షమీ. ఆయనంటే నాకు చాలా గౌరవం. మీరు రివర్స్ స్వింగ్ చేస్తే, అది బాల్ ట్యాంపరింగ్ కాదా? మాజీ ఆటగాళ్లు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని నేను భావిస్తాను. వసీం అక్రమ్ కూడా అంపైర్లు మీకు బంతిని ఎలా ఇస్తారు అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఈ తరహా కార్టూన్‌గిరి మంచిది కాదు. ప్రజలను ఫూల్ చేసేందుకు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని షమీ విమర్శించాడు.

Next Story