వన్డేల్లో వరుసగా అత్యధిక మ్యాచ్‌లలో టాస్ ఓడిన జట్టుగా నెదర్లాండ్స్ పేరిట ఉన్న రికార్డును భారత్ సమం చేసింది. మార్చి 2011 నుంచి ఆగస్టు 2013 మధ్య నెదర్లాండ్స్ వరుసగా 11 మ్యాచ్ ల్లో టాస్ ఓడింది. ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో టాస్ ఓడటంతో ఈ రికార్డును నమోదు అయింది. భారత జట్టు 2023 నవంబర్ 19న జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ నుంచి ఇప్పటి వరకు 11 సార్లు టాస్ గెలవలేకపోయింది. ఇదే ఏడాది డిసెంబర్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల్లోనూ టీమిండియా టాస్ ఓడిపోయింది. ఆ తర్వాత 2024 ఆగస్టులో శ్రీలంకతో ఆడిన మూడు వన్డేల సిరీస్ లోనూ భారత్ టాస్ ఓడింది.
ఇటీవల ఇంగ్లండ్ తో జరిగిన మూడు వన్డేల్లోనూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ ఓడిపోయాడు. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లోనూ భారత్ టాస్ గెలవలేకపోయింది. మరో మ్యాచ్ లో టాస్ ఓడితే.. భారత్ పేరిట అత్యధికసార్లు టాస్ ఓడిన చెత్త రికార్డు నమోదు అవుతుంది. భారత్ తర్వాతి మ్యాచ్ ఫిబ్రవరి 23న పాకిస్థాన్ తో ఉంది. బ్లాక్ బస్టర్ గేమ్ లో టీమిండియా టాస్ గెలుస్తుందో లేదో చూడాలి.