చెపాక్ లో ఆసీస్ ను చుట్టేశాం

చెపాక్‌ స్టేడియంలో భారత బౌలర్లు ఆసీస్ బ్యాట్స్మెన్ కు చుక్కలు చూపించారు.

By Medi Samrat  Published on  8 Oct 2023 6:22 PM IST
చెపాక్ లో ఆసీస్ ను చుట్టేశాం

చెపాక్‌ స్టేడియంలో భారత బౌలర్లు ఆసీస్ బ్యాట్స్మెన్ కు చుక్కలు చూపించారు. ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా బౌలర్లు విజృంభించడంతో ఆసీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ముఖ్యంగా స్పిన్నర్లు విజృంభించడంతో ఆసీస్ మోస్తరు స్కోరుకే పరిమితమైంది.49.3 ఓవర్లకు 199 పరుగులు చేసి ఆలౌటైంది. భారత్ ముందు 200 పరుగుల టార్గెట్ ను ఉంచారు.

ఆసీస్ బ్యాటర్లలో స్టీవ్ స్మిత్ (46) టాప్‌ స్కోరర్‌. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా (3/28), కుల్‌దీప్‌ యాదవ్ (2/42), జస్‌ప్రీత్ బుమ్రా (2/35) సూపర్ బౌలింగ్ వేయగా.. అశ్విన్‌, సిరాజ్‌, హార్దిక్ పాండ్య ఒక్కో వికెట్ పడగొట్టారు. 2 వికెట్ల నష్టానికి 110 పరుగులతో ఒకానొక దశలో ఆసీస్ పటిష్ట స్థితిలో కనిపించింది. అయితే 199 పరుగులకే కట్టడి చేశారు భారత బౌలర్లు.

Next Story