వెస్టిండీస్‌తో జరిగిన చివరి టీ20లో టీమిండియా భారీ విజయం సాధించింది. బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ 64 పరుగులతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. మ్యాచ్‌లో స్పిన్నర్లు మొత్తం 10 వికెట్లు తీశారు. దీంతో వెస్టిండీస్‌పై భారత్ 88 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసి.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తో ముగించింది. శ్రేయాస్ అయ్యర్ అర్ధ సెంచరీకి తోడు.. దీపక్ హుడా (25 బంతుల్లో 38), స్టాండ్-ఇన్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 28) పరుగులు చేయడంతో భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.
ఛేజింగ్‌కు దిగిన వెస్టిండీస్ 16 ఓవర్లలో 100 పరుగులకు ఆలౌట్ అయ్యింది. వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్‌లలో షిమ్రాన్ హెట్‌మెయర్ (35 బంతుల్లో 56) మినహా ఎవరూ క్రీజులో ఎక్కువ సేపు నిలవలేదు. దీంతో విండీస్ ఇన్నింగ్సు 15.4 ఓవర్లకే ముగిసింది. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ నాలుగు, అక్షర్ పటేల్ మూడు, కుల్‌దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టారు.