విండీస్‌పై విక్టరీ.. రెండున్నర రోజుల్లోనే!!
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు విజయం సాధించింది.
By - Knakam Karthik |
విండీస్‌పై విక్టరీ.. రెండున్నర రోజుల్లోనే!!
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు విజయం సాధించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌ను రెండున్నర రోజుల్లోనే ముగించి, ఇన్నింగ్స్ 140 పరుగుల భారీ తేడాతో భారత జట్టు గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బౌలింగ్ చేసిన భారత్, అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. భారత బౌలర్ల ధాటికి వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 162 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తరపున కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా సెంచరీలు చేశారు. దీంతో భారత్ 5 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగుల భారీ ఆధిక్యాన్ని సంపాదించింది.
రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ కేవలం 146 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విజయం సాధించింది. విండీస్ రెండో ఇన్నింగ్స్ లో జడేజా 4, సిరాజ్ 3 వికెట్లు తీసి విండీస్ పతనాన్ని శాసించారు. ఈ గెలుపుతో రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో, చివరి టెస్ట్ మ్యాచ్ అక్టోబర్ 10 నుంచి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది.