కాంస్యం గెలిచిన భారత హాకీ జట్టు

పారిస్ ఒలింపిక్స్ లో భారత జట్టు కాంస్యం గెలిచింది. స్పెయిన్ తో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో 2-1 తేడాతో భారత్ కాంస్య పతకం గెలిచింది

By Medi Samrat  Published on  8 Aug 2024 7:33 PM IST
కాంస్యం గెలిచిన భారత హాకీ జట్టు

పారిస్ ఒలింపిక్స్ లో భారత జట్టు కాంస్యం గెలిచింది. స్పెయిన్ తో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో 2-1 తేడాతో భారత్ కాంస్య పతకం గెలిచింది. గత ఒలింపిక్స్ లో కాంస్యం గెలిచిన భారత్.. పారిస్ ఒలింపిక్స్ లో కూడా మూడో స్థానంలో నిలిచి భారత్ కు పతకాన్ని అందించింది.

ఆఖరి నిమిషాల్లో స్పెయిన్ గోల్ కీపర్ లేకుండా ఆడింది. మరో వైపు వరుసగా స్పెయిన్ పెనాల్టీ కార్నర్లు అందుకుంది. స్పెయిన్‌ పెనాల్టీ కార్నర్‌లను భారత గోల్ కీపర్ పిఆర్ శ్రీజేష్ అద్భుతంగా ఆడాడు. స్పెయిన్ తరపున మార్క్ మిరాలెస్ గోల్ చేయగా.. హర్మన్ ప్రీత్ సింగ్ భారత్ తరపున రెండు గోల్స్ చేశాడు.

Next Story