తొలి వన్డేలో అద‌ర‌గొట్టిన కుర్రాళ్లు.. దక్షిణాఫ్రికాపై భారత్ భారీ విజ‌యం

భారత్-దక్షిణాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్ ఆదివారం ప్రారంభమైంది. జోహన్నెస్‌బర్గ్‌లోని న్యూ వాండరర్స్ స్టేడియంలో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో

By Medi Samrat  Published on  17 Dec 2023 12:58 PM GMT
తొలి వన్డేలో అద‌ర‌గొట్టిన కుర్రాళ్లు.. దక్షిణాఫ్రికాపై భారత్ భారీ విజ‌యం

భారత్-దక్షిణాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్ ఆదివారం ప్రారంభమైంది. జోహన్నెస్‌బర్గ్‌లోని న్యూ వాండరర్స్ స్టేడియంలో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఆతిథ్య‌ జట్టు 116 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఛేదనలో టీమిండియా 16.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ల‌క్ష్యాన్ని ఛేదించింది. దీంతో మూడు వ‌న్డేల‌ సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ను భారత జట్టు విజయంతో శుభారంభం చేసింది. ఈ ఏడాది వన్డేల్లో భారత్‌కు ఇది 26వ విజయం. 1999లో ఆస్ట్రేలియా 26 మ్యాచ్‌లు గెలిచింది. 2023లో కంగారూ జట్టు 30 మ్యాచ్‌లు గెలిచింది. సిరీస్‌లో రెండో మ్యాచ్ డిసెంబర్ 19న గక్బెరా వేదికగా జరగనుంది. ఐదేళ్ల తర్వాత దక్షిణాఫ్రికాలో భారత్‌ వన్డే విజయం సాధించింది. చివరిసారిగా 2018లో సెంచూరియన్‌ మైదానంలో టీమిండియా విజయం సాధించింది. ఆ తర్వాత 2022లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది.

ఛేదనలో టీమిండియా 16.4 ఓవర్లలోనే ల‌క్ష్యాన్ని ఛేదించింది. భారత్ తరఫున అరంగేట్రం చేసిన సాయి సుదర్శన్ అజేయంగా 55 పరుగులు చేశాడు. అతడు 43 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో తొలి అర్ధ‌సెంచ‌రీ న‌మోదు చేశాడు. శ్రేయాస్ అయ్యర్ 45 బంతుల్లో 52 పరుగులు చేశాడు. అత‌డు ఆరు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. ఐదు పరుగుల వద్ద రుతురాజ్ గైక్వాడ్ ఔటయ్యాడు. తిలక్ వర్మ ఒక పరుగు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో వియాన్ ముల్డర్, ఆండిలే ఫెహ్లుక్వాయో ఒక్కో వికెట్ తీశారు. భారత బౌలింగ్‌లో అర్ష్‌దీప్‌ సింగ్‌, అవేష్‌ ఖాన్‌ అద్భుత ప్రదర్శన చేశారు. వీరిద్దరూ కలిసి తొమ్మిది వికెట్లు తీశారు. అర్ష్‌దీప్‌కు ఐదు వికెట్లు, అవేశ్‌కు నాలుగు వికెట్లు దక్కాయి.

Next Story