మొద‌టి వ‌న్డేలో టీమ్ఇండియా భారీ విజ‌యం

India Beat England In First One Day Match. పుణె వేదిక‌గా జ‌రుగుతున్న తొలి వ‌న్డేలో టీమ్ఇండియా భారీ విజ‌యం సాధించింది.

By Medi Samrat  Published on  23 March 2021 4:15 PM GMT
మొద‌టి వ‌న్డేలో టీమ్ఇండియా భారీ విజ‌యం

పుణె వేదిక‌గా జ‌రుగుతున్న తొలి వ‌న్డేలో టీమ్ఇండియా భారీ విజ‌యం సాధించింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొద‌ట బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా ఓపెన‌ర్లు శుభారంభాన్నిచ్చారు. ఓపెన‌ర్ శిఖ‌ర్ దావ‌న్‌( 98;106 బంతుల్లో 11పోర్లు, 2 సిక్స‌ర్లు) తృటిలో సెంచ‌రీ మిస్ చేసుకోగా.. వ‌న్ డౌన్‌లో వ‌చ్చిన‌ కెప్టెన్ విరాట్ కోహ్లీ(56; 60బంతుల్లో 6పోర్లు), కేఎల్ రాహుల్‌(62; 43 బంతుల్లో 4పోర్లు, 4సిక్స‌ర్లు), కృనాల్ పాండ్య (58; 31 బంతుల్లో 7 పోర్లు, 2 సిక్స‌ర్లు) లు అర్థ‌శ‌త‌కాల‌తో రాణించ‌డంతో టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్ల న‌ష్టానికి 317 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. దీంతో ఇంగ్లాండ్ ముందు 318 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఉంచింది.

అనంత‌రం ల‌క్ష్య చేధ‌న‌కు దిగిన ఇంగ్లాండ్‌కు ఓపెన‌ర్లు శుభారంభానిచ్చారు. మొద‌టి వికెట్ 135 ప‌రుగుల బాగ‌స్వామ్యాన్ని న‌మోదు చేశారు. ఓపెన‌ర్లు జానీ బెయిర్ స్టో(94) రెచ్చిపోగా, జాస‌న్ రాయ్‌(46) రాణించారు. మిగ‌తా బ్యాట్స్‌మెన్‌ల‌లో మొయిన్ అలీ(30) మిన‌హా ఎవ‌రూ రాణించ‌క‌పోవ‌డంతో 42.1 ఓవ‌ర్ల‌లో 251 ప‌రుగులే చేసి ఇంగ్లాండ్ 66 ప‌రుగుల తేడాతో భారీ ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంది. భార‌త బౌల‌ర్ల‌లో మొద‌టి వ‌న్డే ఆడుతున్న ప్ర‌సీద్ కృష్ణ నాలుగు, కృనాల్ పాండ్యా ఒక వికెట్ తీయ‌గా.. శార్దుల్ టాగూర్ మూడు వికెట్లు, భువ‌నేశ్వ‌ర్ కుమార్ రెండు వికెట్లు తీశారు. ఇదిలావుంటే.. బ్యాటింగ్‌లో రాణించిన శిఖ‌ర్ ధావ‌న్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ ల‌భించింది.‌





Next Story