కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికా, భారత జట్లు మూడో టెస్టులో తలపడుతున్నాయి. నిర్ణయాత్మక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోహ్లీ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వెన్నునొప్పి కారణంగా రెండో టెస్టుకు దూరం అయిన కోహ్లీ జట్టులోకి రాగా.. గాయం కారణంగా మహమ్మద్ సిరాజ్ దూరం అయ్యాడు. సిరాజ్ స్థానంలో పేసర్ ఉమేశ్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. అయితే.. బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు దక్షిణాఫ్రికా పేసర్లు షాకిచ్చారు. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(15), కేఎల్ రాహుల్(12) ఇద్దరిని పెవిలియన్ చేర్చారు. దీంతో భారత్ 33 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం కెప్టెన్ కోహ్లీ (0), పుజారా(2) పరుగులతో క్రీజులో ఉన్నారు.