హైద్రాబాద్‌లో భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్.. రేపటి నుండి అందుబాటులో టిక్కెట్లు
India-Aus Hyderabad T20I match online tickets to be available from Sep 15. సెప్టెంబర్ 25న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న భారత్-ఆస్ట్రేలియా
By Medi Samrat Published on 14 Sep 2022 10:21 AM GMT
సెప్టెంబర్ 25న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న టీ20 క్రికెట్ మ్యాచ్ కోసం ఆన్‌లైన్ టిక్కెట్ల విక్రయం గురువారం నుంచి అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. టిక్కెట్లు పేటీఎం, పేటీఎం ఇన్సైడర్ యాప్‌లలో అందుబాటులో ఉంటాయి. టిక్కెట్ ధరలు రూ.10,000 నుండి రూ.300 వరకు ఉంటుంది.
ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం దాదాపు 55,000 మంది సామర్థ్యంతో హైద్రాబాద్ నగరంలో నిర్మించబడిన ప్రధాన క్రికెట్ స్టేడియం. అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన ఈ స్టేడియం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)తో పాటు అనేక అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆతిధ్యం ఇచ్చింది.
ఇదిలావుంటే.. ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. భారత్, ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనున్నాయి.