నో శ్రేయాస్ అయ్యర్.. ఆసియా కప్‌లో ఆడ‌బోయే 15 మంది వీరే..!

ఆసియా కప్‌ టోర్నీ కోసం భారత్‌ జట్టును బీసీసీఐ ప్రకటించింది.

By Knakam Karthik
Published on : 19 Aug 2025 4:22 PM IST

Sports News, Asia Cup 2025, Team India, Bcci

ఆసియా కప్​ స్క్వాడ్​ను ప్రకటించిన బీసీసీఐ

ఆసియా కప్ టీ20కి భారత జట్టును ప్రకటించారు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని జట్టు ఈ టోర్నీలో ఆడ‌నుంది. శుభమాన్ గిల్ కూడా ఈ టోర్నమెంట్‌లో కనిపించనున్నాడు. అతడిని వైస్‌ కెప్టెన్‌గా నియమించారు. అంతకుముందు ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో భారత జట్టు చివరిసారిగా టీ20 సిరీస్‌లో శుభ్‌మన్ లేడు. కానీ, ఈ జట్టులోకి శుభ్‌మన్ తిరిగి వచ్చాడు. అదే సమయంలో జస్ప్రీత్ బుమ్రాపై సస్పెన్స్ కూడా ముగిసింది. అతడు ఆసియా కప్‌లో ఆడబోతున్నాడు.

ఇది కాకుండా.. ఇంతకుముందు జట్టులో భాగమైన ఆటగాళ్లు మాత్రమే ఉన్నారు. రింకూ సింగ్ చోటు సంపాదించుకోగా, శ్రేయాస్ అయ్యర్ మరోసారి నిరాశే ద‌క్కింది. భారత జట్టులో నలుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ ఉండగా, నలుగురు ఆల్ రౌండర్లు ఉన్నారు. జ‌ట్టులో ఇద్దరు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జితేష్, శాంసన్‌లు ఉండగా, ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్లు, ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లు ఉన్నారు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనుంది. అంతకు ముందు టీమిండియా దాదాపు 20 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.

భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, సంజూ శాంస‌న్‌, హర్షిత్ రాణా.

స్టాండ్-బైస్ : ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్

Next Story