భార‌త్, పాక్‌ ఆట‌గాళ్లు ఎక్కువ డ‌బ్బులు డిమాండ్ చేయాలి : క్రిస్ గేల్

India and Pakistan players should demand a lot of money for WC games. వెస్టిండీస్ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్ ఐసీసీ వ‌న్డే ప్రపంచ కప్-2023లో సెమీ-ఫైనల్‌కు చేరే నాలుగు జట్లను ఎంపిక చేశాడు.

By Medi Samrat  Published on  30 Jun 2023 3:44 PM IST
భార‌త్, పాక్‌ ఆట‌గాళ్లు ఎక్కువ డ‌బ్బులు డిమాండ్ చేయాలి : క్రిస్ గేల్

వెస్టిండీస్ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్ ఐసీసీ వ‌న్డే ప్రపంచ కప్-2023లో సెమీ-ఫైనల్‌కు చేరే నాలుగు జట్లను ఎంపిక చేశాడు. పాకిస్థాన్, భారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయని క్రిస్ గేల్ త‌న‌ అభిప్రాయం వ్య‌క్తం చేశాడు. 43 ఏళ్ల గేల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారత్‌, పాకిస్తాన్ మధ్య పోటీ కారణంగా.. ప్రపంచం మొత్తం ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌లను చూస్తుందని.. కాబట్టి ఇరు జట్ల ఆటగాళ్లు ఐసీసీ నుండి ఎక్కువ డబ్బు డిమాండ్ చేయాలని అన్నాడు.

భారత్, పాకిస్తాన్ ఆడినప్పుడల్లా.. ముఖ్యంగా ప్రపంచకప్‌లో.. వారు భారీ మొత్తాన్ని సేకరిస్తారు. ఈ ఒక్క మ్యాచ్ ద్వారా వ‌ర‌ల్డ్ క‌ప్‌కు అయ్యే ఖ‌ర్చు మొత్తం వ‌స్తుంది. ఈ మ్యాచ్‌లు టీవీల్లో విపరీతంగా అమ్ముడవుతాయి. అందుకే పాకిస్థాన్, భారత్ ఆటగాళ్లు ఈ మ్యాచ్‌ల‌లో ఆడేందుకు ఎక్కువ డబ్బు డిమాండ్ చేయాలి. ఈ ఆటగాళ్ల స్థానంలో నేను ఉంటే.. ఖచ్చితంగా ఎక్కువ డబ్బు డిమాండ్ చేసి ఉండేవాడినన్నారు.

ప్రపంచ కప్-2023లో అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్‌, పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో లక్ష మంది ప్రేక్షకులు హాజరవుతారని అంచనా. కాగా, భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ ప్రకటించినప్పటి నుంచి అహ్మదాబాద్‌లోని హోటళ్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అహ్మదాబాద్‌లో హోటళ్ల అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైందని, ఇక్కడ ఒక్కరోజు అద్దె దాదాపు 50 వేలకు చేరిందని వార్త‌లు ఛ‌క్క‌ర్లు కొడుతున్నాయి.


Next Story