ఆసియా కప్ లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ లైవ్ చూడాలనుకుంటున్నారా..?
IND vs PAK Live Streaming Details. ఆసియా కప్-2022 లో భాగంగా భారత్-పాక్ ఈరోజు తలపడనున్నాయి.
By Medi Samrat Published on 28 Aug 2022 3:20 PM ISTఆసియా కప్-2022 లో భాగంగా భారత్-పాక్ ఈరోజు తలపడనున్నాయి. ఆసియా కప్ 2022 లో మ్యాచ్ నం.2 భారత్-పాకిస్థాన్ మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. భారత్ లో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో భారత్-పాక్ మధ్య జరిగే మ్యాచ్ ను ప్రసారం చేస్తున్నారు. స్టార్ నెట్వర్క్ ఆసియా కప్ ను టెలీకాస్ట్ చేయనుంది. హాట్‌స్టార్‌లో మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. కాబట్టి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్లు.. హ్యాపీగా మ్యాచ్ ను చూసేయొచ్చు.
రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న భారత్, బాబర్ ఆజం కెప్టెన్ గా ఉన్న పాకిస్థాన్ తో తలపడనుంది. గత సంవత్సరం T20 ప్రపంచ కప్- 2021 సందర్భంగా దుబాయ్‌లో ఇరు జట్లు తలపడినప్పుడు భారత్ పై 10 వికెట్ల తేడాతో పాక్ గెలిచింది. ఈ మ్యాచ్ లో గెలిచి భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తూ ఉంది.
ఇరు జట్ల వివరాలు :
భారత్: రోహిత్ శర్మ (సి), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, దీపక్ హుడా, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్. స్టాండ్‌బై: శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్.
పాకిస్థాన్: బాబర్ ఆజం (సి), షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, షానవాజ్ దహానీ, ఉస్మాన్ ఖదీర్, మొహమ్మద్ ఖదీర్