పాక్ ఆలౌట్‌.. భారత్ విజ‌య‌ల‌క్ష్యం ఎంతంటే..?

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు దుబాయ్ వేదికగా భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది.

By Medi Samrat  Published on  23 Feb 2025 6:38 PM IST
పాక్ ఆలౌట్‌.. భారత్ విజ‌య‌ల‌క్ష్యం ఎంతంటే..?

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు దుబాయ్ వేదికగా భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓటమిని చవిచూడగా, బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో వరుసగా రెండో మ్యాచ్‌లో విజయం సాధించి సెమీఫైనల్‌కు అర్హత సాధించాలని భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది. తొలుత టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది.

పాక్‌ భారత్‌కు 242 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. వన్డేల్లో వరుసగా ఐదో మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టును 50 ఓవర్లలోపే భారత్ ఆలౌట్ చేసింది. హర్షిత్ రాణా బౌలింగ్‌లో ఖుష్దిల్ షా కోహ్లీకి క్యాచ్ ఇవ్వ‌డంతో పాక్ ఇన్నింగ్స్ ముగింసింది. ఖుష్దిల్ 39 బంతుల్లో రెండు సిక్సర్ల సాయంతో 38 పరుగులు చేశాడు. భారత్ తరఫున కుల్దీప్ గరిష్టంగా మూడు వికెట్లు, హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీశారు. అంత‌కుముందు ష‌కీల్‌(62), రిజ్వాన్‌(46) రాణించారు.

Next Story