ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో నేడు భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పాక్ జట్టు కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుని 241 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సౌద్ షకీల్ అత్యధికంగా 62 పరుగులు చేయగా, రిజ్వాన్ 46 పరుగులు చేశాడు. కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీశాడు.
భారత్ విజయానికి 242 పరుగులు చేయాల్సి ఉండగా.. కోహ్లీ సెంచరీతో 42వ ఓవర్లోనే మ్యాచ్ ముగిసింది. దీంతో పాకిస్థాన్‌పై భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ తన వన్డే కెరీర్‌లో 51వ సెంచరీని నమోదు చేశాడు. 111 బంతుల్లో 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అంతకుముందు రోహిత్(20), గిల్(46), అయ్యర్(56) రాణించారు. పాక్ బౌలర్లలో షాహిన్, రెండు, అబ్రార్ ఒకటి, కుష్‌దిల్ ఒక వికెట్ తీశారు.