భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బెంగళూరు వేదికగా తొలి మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులకు ఆలౌటైంది. బెంగళూరు టెస్టు తొలిరోజు వర్షం కారణంగా రద్దయింది. న్యూజిలాండ్ ఆటగాళ్లలో సౌదీ 65 పరుగులు, కాన్వే 91పరుగులు, రచిన్ రవీంద్ర 134 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు, రవింద్ర జడేజా మూడు, సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభమైంది. క్రీజులో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 57 పరుగులు చేసింది. భారత జట్టుపై న్యూజిలాండ్ 356 పరుగుల తొలి ఇన్నింగ్సు ఆధిక్యం సాధించింది. భారత్ వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. ప్రస్తుతం రోహిత్ శర్మ(27), యశస్వి జైస్వాల్(29) జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఇద్దరూ బ్యాడ్ బంతులను బౌండరీ లైన్ దాటిస్తున్నారు. ఇంకా రెండు రోజుల ఆట మాత్రమే ఉంది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులు మాత్రమే చేయడంతో.. ఈ మ్యాచ్ ఫలితంపై అంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.