ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రసవత్తరంగా జరుగుతోంది. భారత్ ముందు ఆస్ట్రేలియా 444 పరుగుల లక్ష్యాన్ని ఉంచిన విషయం తెలిసిందే. దీంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు మూడు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. చివరి రోజు భారత జట్టు విజయం సాధించాలంటే 280 పరుగులు చేయాల్సి ఉంది. 179 పరుగుల స్కోరు వద్ద ఇరువురు బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు చేరుకున్నారు. మొదట కోహ్లీ అవుటవగా.. ఆ వెంటనే రవీంద్ర జడేజా ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. జడేజా.. బోలాండ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ అలెక్స్ కారీ చేతికి చిక్కాడు. అనంతరం 56వ ఓవర్లో రహానే(46) స్టార్క్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ప్రస్తుతం భారత్ స్కోరు ఆరు వికెట్ల నష్టానికి 212. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో భారత్ గెలవడం దాదాపు అసాధ్యం. ప్రస్తుతం శార్ధుల్ ఠాకూర్, శ్రీకర్ భరత్ క్రీజులో ఉన్నారు.