వ‌ర్షం కార‌ణంగా చివ‌రి టీ20 రద్దు.. సిరీస్ మ‌న‌దే..!

భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.

By -  Medi Samrat
Published on : 8 Nov 2025 4:50 PM IST

వ‌ర్షం కార‌ణంగా చివ‌రి టీ20 రద్దు.. సిరీస్ మ‌న‌దే..!

భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అయితే దీని వల్ల భారత్‌కు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఐదు టీ20ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ప్రతికూల వాతావరణం కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి భారత ఇన్నింగ్స్‌లో కేవలం 4.5 ఓవర్లు మాత్రమే ఆడింది. ఆ తర్వాత భారీ వర్షం కూడా కురిసింది. వాతావరణం అనుకూలించకపోవడంతో వర్షం కారణంగా మ్యాచ్‌ను రద్దు చేశారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి భారత్ స్కోరు ఎలాంటి వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 23 పరుగులతో, శుభ్‌మన్ గిల్ 29 పరుగులతో ఆడుతున్నారు.

Next Story