రెండో టీ20ని వర్షం అడ్డుకోనుందా.?

ఆస్ట్రేలియాతో విశాఖపట్నంలో జరిగిన మొదటి T20Iలో భారతజట్టు అద్భుతమైన విజయం సాధించింది.

By Medi Samrat  Published on  26 Nov 2023 8:30 AM GMT
రెండో టీ20ని వర్షం అడ్డుకోనుందా.?

ఆస్ట్రేలియాతో విశాఖపట్నంలో జరిగిన మొదటి T20Iలో భారతజట్టు అద్భుతమైన విజయం సాధించింది. ఇక తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రెండవ మ్యాచ్‌కు భారత్ సిద్ధమైంది. అయితే గత కొన్ని రోజులుగా నగరంలో వాతావరణం క్రికెట్‌కు అనుకూలంగా లేదు. మ్యాచ్ కు ఒక రోజు ముందు అవుట్‌ఫీల్డ్‌ మొత్తం నీటితో నిండి ఉన్న చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు క్రికెట్ అభిమానులను వెంటాడుతూ ఉన్నాయి.

అయితే మ్యాచ్ జరిగే రోజు కూడా నగరంలో వర్షం కురిసే అవకాశం ఉంది. మ్యాచ్ మొత్తం తుడిచిపెట్టుకుపోతుందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అక్యూవెదర్ ప్రకారం.. మ్యాచ్‌ సమయంలో వర్షం పడే అవకాశం ఉంది. డే టైమ్ లో వర్షం పడే అవకాశం 55% ఉంటుంది. మేఘాల ఆవరణం 25% ఉంటుంది. రాత్రి సమయంలో వర్షం పడే అవకాశం 11%కి తగ్గుతుంది.. మేఘాల ఆవరణం 16% ఉంటుంది. పూర్తిగా వాష్‌ అవుట్ జరగడం కష్టమేనని అంటున్నారు. అయితే అవుట్‌ఫీల్డ్ తడిగా ఉంటుందని భావిస్తున్నారు. పిచ్ విషయానికి వస్తే, గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో చివరి 10 మ్యాచ్‌లలో సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 148. ఈ స్టేడియంలో ముందుగా బౌలింగ్ చేయడం బెటర్ అని అంటున్నారు. రెండో బ్యాటింగ్ చేసిన జట్టు 67 శాతం మ్యాచ్‌లలో విజయం సాధించింది.

Next Story