ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి హజ్ యాత్రలో ఉంది భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. గత కొంతకాలంగా తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలుస్తోంది. పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో విడిపోయింది. హసిన్ జహాన్ నుండి విడిపోయిన భారత క్రికెటర్ మహమ్మద్ షమీని సానియా మీర్జా వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా సానియా తండ్రి ఈ పుకార్లకు చెక్ పెట్టారు.
సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా NDTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ పుకార్లను తోసిపుచ్చారు. 'ఇదంతా చెత్త వార్తలు.. ఆమె అతన్ని ఒక్కసారి కూడా కలవలేదు.' అంటూ తేల్చి చెప్పారు. సానియా, షోయబ్ మాలిక్ 2010లో వివాహం చేసుకున్నారు. 2018లో ఇజాన్ మీర్జా మాలిక్‌ను స్వాగతించారు. 2022లో వారి విడాకులపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ తర్వాత అధికారికంగా విడాకుల ప్రకటన వచ్చింది.
షోయబ్ సానియాతో విడిపోయాక.. పాకిస్థానీ నటి సనా జావేద్ ను పెళ్లి చేసుకున్నాడు. షోయబ్ మాలిక్ నుండి విడిపోతున్నట్లు ప్రకటించిన ఐదు నెలల తర్వాత సానియా మీర్జా ఇటీవలే తన హజ్ యాత్రను ప్రారంభించింది. సోషల్ మీడియాలో హజ్ యాత్రకు సంబంధించిన ఫోటోలను సానియా పోస్టు చేస్తూ వస్తోంది.