నేను నీ అతిపెద్ద ఛీర్‌లీడర్‌ని.. చాహల్‌కు భార్య పంపిన వీడియో సందేశం వైరల్
రాజస్థాన్ రాయల్స్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ బుధవారం గుజరాత్ టైటాన్స్‌పై తన ఐపీఎల్ కెరీర్ 150వ మ్యాచ్ ఆడాడు.
By Medi Samrat Published on 11 April 2024 3:07 PM ISTరాజస్థాన్ రాయల్స్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ బుధవారం గుజరాత్ టైటాన్స్‌పై తన ఐపీఎల్ కెరీర్ 150వ మ్యాచ్ ఆడాడు. IPL ద్వారా గుర్తింపు పొంది ఆ తర్వాత భారత్‌కు ఆడే అవకాశం పొందిన అతికొద్ది మంది భారతీయ ఆటగాళ్లలో చాహల్ ఒకడు. ప్రస్తుతం ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చాహల్ నిలిచాడు. ఈ సందర్భంగా భార్య ధనశ్రీ వర్మ నుంచి చాహల్ ప్రత్యేక వీడియో సందేశాన్ని అందుకున్నాడు.
ఐపీఎల్‌లో 150 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన 26వ ఆటగాడిగా చాహల్ నిలిచాడు. దీంతో ధనశ్రీ వర్మ యుజ్వేంద్ర చాహల్‌ను ప్రశంసించింది. తనను తాను అతని అతిపెద్ద చీర్‌లీడర్‌గా పేర్కొంది.
జట్టు ఒత్తిడిలో ఉన్నప్పుడు.. బౌలింగ్‌ను తన భర్త యుజ్వేంద్ర చాహల్‌కు ఇవ్వడాన్ని నమ్ముతానని.. వికెట్లు తీయడం ద్వారా తన కెప్టెన్ నమ్మకాన్ని చాహల్ నిలబెట్టుకుంటాడని ధనశ్రీ వర్మ అన్నారు. ధనశ్రీ వర్మ కొరియోగ్రాఫర్.. యాక్టర్ అని తెలిసిందే. చాహల్ 150వ మ్యాచ్‌పై ధనశ్రీ వర్మ స్పందనను రాజస్థాన్ రాయల్స్ తమ సోషల్ మీడియా హ్యాండిల్‌లో పంచుకుంది.
To Yuzi on his 150th IPL game, with love from his biggest supporter. 💗 pic.twitter.com/rVyfsD7eYN
— Rajasthan Royals (@rajasthanroyals) April 10, 2024
యుజ్వేంద్ర చాహల్.. నీ 150వ IPL మ్యాచ్‌కు శుభాకాంక్షలు. నీ వల్ల మాకు చాలా గర్వంగా ఉంది. ఇన్నేళ్లుగా మీరు ఆడిన విధానం.. ముందుగా మునుపటి జట్టుకు, ఇప్పుడు రాయల్స్‌కు.. అందరూ కూడా నీ ఆట గురించి చాలా గర్వపడుతున్నారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నీవు బలంగా తిరిగి వచ్చిన ప్రతిసారీ.. నీ వెనక మేమున్నాము. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడల్లా వచ్చి వికెట్లు పడగొట్టే బౌలర్ నువ్వు మాత్రమే. నువ్వు ఇలాగే ఉండు. నీ శైలికి కట్టుబడి ఉండు. మేమంతా నీకు మద్దతుగా ఉన్నాం. నేను నీ అతిపెద్ద ఛీర్‌లీడర్‌ని.. నేను ఎల్లప్పుడూ 100 శాతం మీకు మద్దతు ఇస్తానని పేర్కొంది.
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా యుజువేంద్ర చాహల్‌నిలిచాడు. చాహల్ 150 మ్యాచ్‌లు ఆడి 197 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించేందుకు కేవలం మూడు వికెట్ల దూరంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలవనున్నాడు. ప్రస్తుత ఐపీఎల్‌లో చాహల్ 5 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ రేసులో ఉన్నాడు.