పృథ్వీ షా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. మహారాష్ట్ర కెప్టెన్‌గా బరిలోకి దిగి విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 36 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 66 పరుగులు చేశాడు. కోల్‌కతాలోని సాల్ట్ లేక్ క్యాంపస్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ నిర్దేశించిన 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మహారాష్ట్రకు పృథ్వీ షా మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 23 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. మరో ఓపెనర్ అర్షిన్ కులకర్ణితో కలిసి తొలి వికెట్‌కు 73 బంతుల్లోనే 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ మ్యాచ్ లో మహారాష్ట్ర 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.
పేలవ ఫామ్, క్రమశిక్షణ సమస్యల కారణంగా పృథ్వీ షా ఐపీఎల్ కాంట్రాక్ట్ కోల్పోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని విడుదల చేయడంతో వేలంలో ఏ జట్టూ అతడిని కొనుగోలు చేయలేదు. ముంబై రంజీ జట్టులో అవకాశాలు లేకపోవడంతో ఈ సీజన్‌లో మహారాష్ట్రకు మారాడు.