ఆస్ట్రేలియాలో వైట్-బాల్ టూర్ నుండి తనను తప్పించినందుకు భారత పేసర్ మహ్మద్ షమీ ఇటీవల బీసీసీఐ సెలెక్టర్లపై విమర్శలు గుప్పించాడు. రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున ఆడటం తాను ఫిట్‌గా ఉన్నానని నిరూపిస్తుందని, దీనిపై సెలక్షన్ ప్యానెల్‌కు అప్‌డేట్ చేయడం తన పని కాదని షమీ అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో చివరిసారిగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు షమీ. 2023 ప్రపంచ కప్ తర్వాత చీలమండ, మోకాలి గాయాలతో షమీ పోరాడుతున్నాడు.
షమి చేసిన వ్యాఖ్యలకు BCCI చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడారు. ఫిట్‌గా ఉంటే జట్టులో ఉండేవాడని అన్నారు. సోషల్ మీడియాలో అతను ఏమి చెప్పాడో నాకు ఖచ్చితంగా తెలియదు, బహుశా నేను దానిని చదివితే, నేను అతనికి కాల్ చేయవచ్చు కానీ నా ఫోన్ అందరు ఆటగాళ్ల కోసం ఎల్లప్పుడూ ఆన్‌లో ఉంటుందని అగార్కర్ అన్నారు. గత కొన్ని నెలలుగా నేను అతనితో చాలాసార్లు చాట్ చేసానని అగార్కర్ తెలిపారు. షమీ భారతదేశం తరపున అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. ఇంగ్లాండ్ కంటే ముందే, అతను ఫిట్‌గా ఉంటే, అతను విమానంలో ఉండేవాడని మేము చెప్పాము. దురదృష్టవశాత్తు, అతను లేడు. మా దేశీయ సీజన్ ఇప్పుడే ప్రారంభమైందని అగార్కర్ స్పష్టం చేశారు.