ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో కోహ్లీకి-రోహిత్ కు ఎన్ని రేటింగ్ పాయింట్స్ తేడా అంటే..!

ICC Test Rankings. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో రోహిత్ శర్మ కూడా దూసుకు వస్తున్నాడు. టీమిండియా యువ పేసర్‌

By Medi Samrat  Published on  18 Aug 2021 1:47 PM GMT
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో కోహ్లీకి-రోహిత్ కు ఎన్ని రేటింగ్ పాయింట్స్ తేడా అంటే..!
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో రోహిత్ శర్మ కూడా దూసుకు వస్తున్నాడు. టీమిండియా యువ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌, ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ కూడా సత్తా చాటారు. ఇంగ్లండ్‌తో ముగిసిన రెండో టెస్ట్‌లో 8 వికెట్లతో రాణించిన హైదరాబాదీ సిరాజ్‌ 465 రేటింగ్ పాయింట్స్‌తో ఏకంగా 18 స్థానాలు ఎగబాకి 38వ స్థానానికి దూసుకొచ్చాడు. శతకంతో అదరగొట్టిన కేఎల్‌ రాహుల్‌ 19 స్థానాలు మెరుగుపరుచుకుని 37వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. కేన్ విలియమ్సన్(901) అగ్రస్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ 893 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానానికి దూసుకురాగా, స్టీవ్‌ స్మిత్‌(891) మూడో స్థానానికి, మార్నస్ లబుషేన్(878) నాలుగో ప్లేస్‌కు దిగజారారు.


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తన ఐదో స్థానాన్ని నిలబెట్టుకోగా, తొలి ఇన్నింగ్స్‌లో అర్ధసెంచరీతో రాణించిన రోహిత్‌ శర్మ(6వ ర్యాంక్‌) ర్యాంక్‌ మెరుగుపరుచుకోకపోయినా కెరీర్ బెస్ట్ 773 రేటింగ్ పాయింట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. రోహిత్ కంటే కోహ్లి కేవలం మూడు రేటింగ్ పాయింట్లు మాత్రమే ఎక్కువగా ఉన్నాడు. ఈ జాబితాలో రోహిత్‌ తర్వాతి స్థానంలో 736 పాయింట్లతో రిషబ్‌ పంత్‌ 7వ స్థానంలో కొనసాగుతున్నాడు.

టెస్ట్‌ బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌ లో పాట్ కమిన్స్(908) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. రవిచంద్రన్ అశ్విన్(848) సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. లార్డ్స్ టెస్ట్‌లో 5 వికెట్లతో రాణించిన ఆండర్సన్‌ ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని ఆరో స్థానానికి చేరుకున్నాడు. స్టువర్ట్ బ్రాడ్ 8వ స్థానంలో, బుమ్రా ఒక ర్యాంక్ దిగజారి 10వ స్థానంలో నిలిచారు.


Next Story